Telangana Weather Updates : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Indian Metrological Department) చల్లటి శుభవార్త చెప్పింది. రాగల మూడురోజులు మంగళవారం నుంచి పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని స్ఫష్టం చేసింది. ఈ మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పడనున్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఈరోజు రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు(Heat Waves) వీస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
నిప్పులకుంపటిగా తెలంగాణ - వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు - heat waves in telangana
IMD Issues Alert on Heat waves :ఏప్రిల్ ప్రథమార్థంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, ఈ మాసం చివరితో పాటు మే నెలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు జంకుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీచాయి. వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది.