Telangana Climate Update For Next 2 Days : ఇటీవల కాలంలో నగరంలోని పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడటంతో, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా విపరీతమైన ఉక్కపోత, వడగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర వాసులకు ఐఎండీ గుడ్న్యూస్ చెప్పింది.
Yellow Alerts Issue :రాష్ట్రంలో రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
జూన్ 2న పలు జిల్లాల్లో భారీ వర్షాలు :జూన్ 2వ తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.