Telangana Weather Forecast Today: రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. దీంతో గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Weather Report Sunday: నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి తెలంగాణ రాష్టంలోని నిజామాబాద్ దిశగా వెళ్తున్నావని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా నైరుతి దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొంది. ఇవాళ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో కురిసే అవకాశం ఉంది.
ఏపీలో విస్తరించిన రుతుపవనాలు - పలు జిల్లాల్లో జోరు వానలు - HEAVY RAINS IN ANDHRA PRADESH TODAY