Telangana Tet Application 2025 Process Postponed :సాంకేతిక కారణాలతోటెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. అభ్యర్థులు ఈ నెల 7నుంచి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలపింది. ఎవరూ ఆందోళన చెందాల్సింది లేదని వివరించింది. కాగా మంగళవారం టెట్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేసింది. గతేడాది మే నెలలో తొలిసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం మరోమారు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
టెట్ రాసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులుఈ నెల 7నుంచి :అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోపు టెట్ పరీక్షకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలిపారు. అయితే కొన్ని సాంకేేతిక సమస్యలు తలెత్తడంతో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం అవుతుండడంతో వాయిదా వేశారు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్లో మరింత సమాచారం ఉంటుందని, ఏవైనా సందేహాలుంటే అందులో చెక్ చేసుకోవాలని తెలిపారు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సర్కార్ ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ నిర్వహించగా మరో మారు నోటిఫికేషన్ విడుదల చేయటంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆరు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించగా జనవరిలో జరిగేది ఏడోసారి కానుంది.