TS TET Free Mock Test 2024:తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)కు అప్లై చేసిన అభ్యర్థులకు బిగ్ అలర్ట్. టెట్‌లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు వీలుగా ఫ్రీ గా మాక్ టెస్టులు రాసే అవకాశాన్ని అభ్యర్థులకు కల్పించింది విద్యాశాఖ. అందుకు సంబంధించి అధికారిక వెబ్సైట్లో ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
TS TET Exams 2024 Updates: కీలకమైన డీఎస్సీ ఉన్న నేపథ్యంలో.. టెట్ స్కోరు కీలకంగా మారనుంది. అయితే కేవలం స్కోర్ మాత్రమే కాదు చాలా మంది క్వాలిఫై కావటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే ప్రిపేర్ అవుతున్నప్పటికీ పరీక్షా విధానం, ప్రశ్నల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా అనేక అంశాలు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ టెట్‌కు ప్రిపేర్ అయ్యే వారి కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. మరి ఈ మాక్ టెస్టులు ఎలా రాయాలంటే..
మాక్ టెస్టులు ఎలా రాయాలంటే:
- తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో పైన కనిపించే TS TET Mock Test-2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద కనిపించే Sigh In ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీకు కొత్త పేజీ ఒపెన్ అవుతుంది. అందులో మాక్ టెస్ట్‌కు సంబంధించిన సూచనలు ఇస్తారు. వాటిని జాగ్రత్తగా చదివి Next బటన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత Declaration Boxలో టిక్ కొట్టి I am ready to begin ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీకు స్క్రీన్ మీద క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది. మీరు అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్క్రీన్ కుడివైపున టైం కూడా కనిపిస్తుంది. టైం అయ్యే లోపల అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
- ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకొవచ్చు.
- ఈ పరీక్షలను రాయటం ద్వారా ఆన్లైన్లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఓ అవగాహనకు వస్తుంది.