Telangana Special SarvaPindi Recipe Making :తెలంగాణ స్పెషల్ వంటకాల్లో సర్వపిండికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ దీనిని ఇష్టంగా. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో సర్వపిండిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే బయట నుంచి వచ్చిన ఆహార ప్రియులైతే సర్వపిండి గురించి ప్రత్యేకంగా తెలుసుకొని, అది దొరికే ప్రాంతానికి వెళ్లి ఇష్టంతో తింటారు. ఇలా అందరి మనసు దోచుకున్న సర్వపిండిని మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చూసేయండి.
సర్వపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు బియ్యపు పిండి
- కొద్దిగా కొత్త మీర
- కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు
- ఒకటిన్నర టీ స్పూన్ నువ్వులు
- ఒక టీ స్పూన్ కారం
- చిటికెడు పసుపు
- రుచికి సరిపడా ఉప్పు
- కొద్దిగా శనగ పప్పు (అరగంట నానపెట్టి ఉంచుకోవాలి)
- 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- ఒక టీ స్పూన్ ధనియాలు (వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మూడింటిని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి)
- సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ
తయారు చేసుకునే విధానం : ముందుగా ఎన్ని సర్వపిండిలను చేయాలనుకుంటున్నామో అంచనా ప్రకారం బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నానబెట్టిన శనగపప్పును ఆ పిండిలో వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర తురుము, నువ్వులు, కారం, ఉప్పు, పసుపు కూడా ఆ పిండిలో కలుపుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. అనంతరం కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ పూరీ పిండిలా వచ్చేంతవరకూ కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా కలపకూడదు. ఎందుకంటే సర్వపిండి సరిగ్గా కాలదు. పైగా ఎక్కువగా నూనె పీల్చుకుంటుంది.