తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్‌పార్టీ (ETV Bharat) Police Focus on Drugs Parties in Telangana : ఒక్కప్పుడు పబ్బుల్లో రేవ్ పార్టీలు, డ్రగ్స్ వినియోగం వంటి కేసులకు హైదరాబాద్ వేదికగా నిలిచేది. కానీ ఇప్పుడు పోలీసుల నిఘా, మాదకద్రవ్యాలపై కట్టుదిట్టమైన చర్యలతో మత్తు పదార్థాల సరఫరా అదుపులోకి వస్తోంది. దేశంతో పాటు విదేశాలకు చెందిన కీలక నేరగాళ్లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హైదరాబాద్‌లో పార్టీలు చేసుకోవాలంటేనే యువతకు భయం మొదలైంది. కాగా ఇలాంటి కార్యకలాపాలకు బెంగళూరు వేదిక కావడం చర్చనీయాశంగా మారింది.
రూటు మార్చిన డ్రగ్స్ కేటుగాళ్లు : గోవా, హైదరాబాద్‌ల్లో టీఎస్ న్యాబ్ నిఘా పెరగటంతో డ్రగ్స్ కేటుగాళ్లు రూటు మార్చారు. తాజాగా వెలుగుచూసిన ఘటనతో రాష్ట్రపోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వేడుకల ముసుగులో మాదకద్రవ్యాల దందాకు పాల్పడుతున్న ఈవెంట్స్ నిర్వాహకులపై కన్నేశారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి సేకరించిన సమాచారంతో మరో డ్రగ్ డాన్ ఆటకట్టించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఇప్పటికే బెంగళూరులో రేవ్‌పార్టీలో సినీ, వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన ఎంతోమంది వేడుకలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్దారించారు. ఖరీదైన డ్రగ్స్‌ను తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లోనూ గుర్తించారు. హైదరాబాద్‌లో పోలీసుల నిఘాతో తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న బెంగళూరుకు వేదికను మార్చారు. అక్కడ ఎక్కువగా నివాసం ఉంటున్న నైజీరియన్ల నుంచి తేలికగా మత్తు పదార్థాలు లభిస్తుండటంతో, ఈవెంట్ నిర్వాహకులు దాన్ని కేంద్రంగా మార్చుకున్నారని నగరానికి చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి వివరించారు.
Rave Party in Hyderabad : మాదాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో సినీ నిర్మాత వెంకట్
Rave Parties in Telangana :మరోవైపు దేశ, విదేశాల అమ్మాయిల తరలింపు. మరింత కిక్ కోసం కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ వినియోగం. రేవ్‌పార్టీల్లో హోరెత్తించే సంగీతం, అలసి పోకుండా ఉండేందుకు మత్తు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. పుణె, కోల్‌కతా, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, బంగ్లాదేశ్, ఉక్రెయిన్ తదితర ప్రాంతాల నుంచి అందమైన యువతులను పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణగా ఆహ్వానిస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజామున వరకూ మత్తులో తూగుతూ నృత్యాలు చేస్తూ ఇష్టానుసారంగా ఉండటమే రేవ్‌పార్టీ ప్రత్యేకత. కొందరు మరో అడుగు ముందుకేసి హిజ్రాలును తీసుకొచ్చి ముజ్రా పేరుతో వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు.
పుట్టినరోజు, పెళ్లిరోజు, బ్యాచిలర్ వేడుకల ముసుగులో ఈ కార్యకలాపాలు సాగిస్తుండటంతో పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. దీన్ని అనువుగా మలచుకొని ఆరు నెలలుగా డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్నారు. దీనికోసం ఒక్కోకరి నుంచి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. గ్లామర్ కోసం సినీ, బుల్లితెర నటులకు రూ.లక్షల్లో అడ్వాన్స్‌లు ఇచ్చి అతిథులుగా రప్పించుకుంటున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ అప్డేట్ - 103 మందిలో తెలుగు నటి సహా 86 మందికి డ్రగ్ పాజిటివ్ - BANGALORE RAVE PARTY DRUG TESTS
బాలికలకు డ్రగ్స్ అలవాటు చేసి రేవ్ పార్టీల్లో వ్యభిచారం! - జగిత్యాల జిల్లాలో గంజాయి ముఠా అరాచకాలు - drug racket bust in jagtial