Telangana Phone Tapping Case Updates :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోబంజారాహిల్స్ పోలీసులకస్టడీలోఉన్న రాధాకిషన్ రావు హైబీపీతో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. ఉదయం నుంచి కూడా ఆయన హైబీపీతో ఇబ్బందిపడినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫోన్ టాపింగ్ కేసులో రెండో రోజు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
Phone Tapping Case Investigation : ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) కేసులో ఆధారాలు ధ్వంసంపై దృష్టి సారించిన దర్యాప్తు బృందం ఆ దిశగా రాధాకిషన్ రావును ప్రశ్నిస్తోంది. ప్రణీతరావు తో కలిసిరాధా కిషన్ రావుహార్ట్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు ఎస్ఐబీ కార్యాలయంలోని(SIB Office) మరిన్ని ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మరింత లోతుగా విచారిస్తున్నారు. అయితే రెండో రోజు రాధా కిషన్ రావుకు బీపీ పెరగడంతో పోలీసులు పోలీస్ స్టేషన్‌కు వైద్యులను రప్పించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వైద్యులు ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - 'రాధాకిషన్ రావు చెప్పినట్లే చేశా'
దర్యాప్తులో వెలుగులోకి కొత్త విషయాలు : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు బృందం ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పలువురి రాజకీయ నేతల ఫోన్లపై ఇద్దరు కానిస్టేబుళ్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం వీరి పాత్ర ఉందని తేలితే దర్యాప్తు బృందం అరెస్టు చేసే అవకాశం ఉంది.