- పురపాలక చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- కొత్తగా స్టేషన్ ఘన్ పూర్, కేసముద్రం, ఎదులాపురం, అశ్వారావు పేట, చేవెళ్ల, మొయినాబాద్, కోహీర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, దేవరకద్ర, మద్దూరు మున్సిపాలిటీల ప్రతిపాదన
- మహబూబ్ నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం
- మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను విలీనం చేసి మంచిర్యాల కార్పొరేషన్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం
LIVE UPDATES : పురపాలక చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం - ASSEMBLY SESSIONS 2024 LIVE UPDATES
Published : 5 hours ago
|Updated : 20 minutes ago
Telangana Assembly Sessions Live Updates : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ అయిదో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో శాసనసభ మొదలైంది. అయితే ఇవాళ పలు అంశాలు శాసనసభలో చర్చకు వస్తుండటంతో ప్రతిపక్షం, అధికారపక్షం ఇరుపక్షాలు తమ వాదనలను గట్టిగా వినిపించే అవకాశం ఉంది. రైతు భరోసా విధివిధానాలపై, భూ భారతి చట్టంపై ఇరు పక్షాలు తమ వాదనలను బలంగా వినిపించేందుకు సిద్దం కావడంతో రాష్ట్ర శాసనసభ ఇవాళ వాడీవేడిగా కొనసాగే అవకాశం ఉంది.
LIVE FEED
- శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం
- విపక్షాల తీరుపై మండిపడిన మంత్రి శ్రీధర్‌బాబు
- సభ నిర్వహణలో కొంత సమాచారలోపం జరిగింది: శ్రీధర్‌బాబు
- చిన్నపాటి సమాచారలోపాన్ని పెద్ద విషయంగా చూడొద్దు: శ్రీధర్‌బాబు
- చిన్నపాటి సమాచారలోపానికి క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు: శ్రీధర్‌బాబు
- శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాల అసహనం
- కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదన్న విపక్షాలు
- శాసనసభను నడిపే తీరు ఇది కాదన్న హరీశ్‌రావు
- శాసనసభ నడుపుతున్న తీరు బాగాలేదన్న అక్బరుద్దీన్
- సమాచారం లేకుండా ఎలా మాట్లాడతామన్న బీజేపీ పక్షనేత
- సమాచారం లేకుండా ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారన్న విపక్షాలు
భట్టి
- రూ.12,117 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు, అప్పుల పేరిట కట్టింది
- ఉద్యోగస్థులకు మార్చి నుంచి ఇప్పటివరకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం
- రూ.20,617 కోట్ల రైతుల అకౌంట్‌లో వేశాం
- గత ప్రభుత్వం 2018-23 వరకు రుణమాఫీ చేస్తామని చేయకుండా వదిలేశారు
- రైతులకు ఉచితంగా క్వాలిటీ పవర్ ఇస్తున్నాం
- గురుకులాల్లో డైట్ మీల్స్‌ను పెంచాం
- మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేశాం
- రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ వెళ్తున్నాం
- ఆర్బీఐ రిపోర్టు చూపిస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు
- రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
- భూ భారతి చట్ట ప్రకటనలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
- శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారని నోటీసు
- సభ ఆమోదం పొందని భూ భారతి బిల్లును చట్టంగా ఎలా ప్రకటిస్తారు: బీఆర్‌ఎస్
- ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారన్న బీఆర్‌ఎస్
- శాసనసభా హక్కుల రక్షణ కోసం సభాపతికి వినతి
- శాసనసభ హక్కులను కాపాడాలన్న బీఆర్ఎస్ శాసనసభా పక్షం
- ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటించిన ప్రభుత్వ తీరుపై అగ్రహం
- పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించిన రాష్ట్ర ప్రభుత్వమన్న బీఆర్ఎస్
- నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను మోసగించిన చర్య అన్న బీఆర్ఎస్
- శాసనసభ గౌరవానికి దెబ్బతీసిన ప్రభుత్వమని బీఆర్ఎస్ అరోపణ
- భారత రాజ్యాంగ ఆర్టికల్ 245 ప్రకారం సభా హక్కులకు హాని కల్గించారన్న బీఆర్ఎస్
ఉత్తమ్
- అన్ని ప్రాజెక్టులు పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నాం : ఉత్తమ్
- కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకుని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
- స్టేషన్‌ఘన్‌పూర్ కాల్వకు రూ.120 కోట్లు మంజూరు చేశాం.. త్వరలో టెండర్లు పిలుస్తాం
- ఇరిగేషన్ శాఖను బలపరుస్తున్నాం
- పదేళ్లుగా ఇరిగేషన్ శాఖలో నియామకాలు లేవు
- మేము అధికారంలోకి వచ్చాక 700 మందిని ఇరిగేషన్ శాఖలోకి తీసుకున్నాం
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ. 37 కోట్లు విడుదల చేశాం
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు ఈ వారంలో రూ.22 కోట్లు విడుదల చేస్తాం
- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాం
- రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తాం
- ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల కుల సంఘాల అసెంబ్లీ ముట్టడి
- ఆందోళనకారులను అడ్డుకొని వాహనాల్లో ఎక్కించిన పోలీసులు
- మాదిగలకు ప్రభుత్వ అనుకూల వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడించామని వెల్లడి
- స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: కేటీఆర్
- కొత్త పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదు: కేటీఆర్
- 3 బిల్లులకు బీఆర్ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నాం: కేటీఆర్
- మా సవరణలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే: కేటీఆర్
- అవసరమైతే సభలో డివిజన్‌కు కూడా పట్టుబడతాం: కేటీఆర్
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది: కేటీఆర్
- నవంబర్‌లోగా కులగణన పూర్తి చేస్తామని కాంగ్రెస్ చెప్పింది: కేటీఆర్
- కులగణన తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారు: కేటీఆర్
- 50శాతం పైగాఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారు: కేటీఆర్
- 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బీసీలను మోసం చేయడమే: కేటీఆర్
- శాసనసభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం
- ప్రతిపక్షాలకు మరొకసారి విజ్ఞప్తి చేసిన స్పీకర్
- వెల్‌లోకి రావడం, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చెయ్యడం సరికాదు: స్పీకర్
- మనం పెట్టుకున్న నిబంధనలు మనమే ఉల్లంఘించడం సరికాదు: స్పీకర్
- ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు
- రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
- ప్రారంభమైన శాసనసభ సమావేశాలు
- శాసనమండలి సమావేశాలు ప్రారంభం
కాసేపట్లో ప్రారంభంకానున్న శాసనసభ, మండలి సమావేశాలు
- కాసేపట్లో ప్రారంభంకానున్న శాసనసభ, మండలి సమావేశాలు
అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి
- అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి
- అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం
- ఇవాళ శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ