Hydra Commissioner Ranganath Visit To Musheerabad : అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం వాటి వివరాలను, వాటికి సంబంధించిన స్థల పత్రాలను పరిశీలించాలని జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 28 August 2024
Telangana News Today Live : తెలంగాణ Wed Aug 28 2024 లేటెస్ట్ వార్తలు- రాంనగర్‌లో ఆక్రమణలు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ - Ranganath Visit To Musheerabad
Published : Aug 28, 2024, 8:00 AM IST
|Updated : Aug 28, 2024, 10:15 PM IST
రాంనగర్‌లో ఆక్రమణలు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ - Ranganath Visit To Musheerabad
రెవెన్యూ నోటీసులపై మల్లారెడ్డి అల్లుడికి ఊరట- వారం రోజులే డెడ్‌లైన్ - Notices To Marri Rajashekar Reddy
Notices To Marri Rajashekar Reddy : చెరువును ఆక్రమించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఆక్రమణలు తొలగించాలంటూ గండిమైసమ్మ తహశీల్దార్ స్పష్టం చేశారు. ఈ నోటీసులపై దుండిగల్‌లోని మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్స్ ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. | Read More
సంఘం డైరీ ఎదుట పాడి రైతులు ఆందోళన - బకాయిలు చెల్లించాకే ప్రారంభం చేసుకోవాలంటూ నిరసన - Dairy Farmers Protest In Nalgonda
Dairy Farmers Protest In Nalgonda : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్‌లో ఉన్న సంఘం డైరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సంఘం డైరీ ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా స్థానిక పాడి రైతుల నుంచి నిరసన ఎదురైంది. రైతులను మోసం చేసి తక్కువ ధరకు వేలం దక్కించుకున్నారని మండిపడ్డారు. పాత బకాయిలు చెల్లించాకే ప్రారంభం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు. | Read More
12 ఏళ్ల ఛత్తీస్‌గఢ్ బాలుడికి అరుదైన ఇన్ఫెక్షన్ - విమానంలో తీసుకొచ్చి ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు - chhattisgarh boy saved kims doctors
chhattisgarh Boy life Saved Kims Cuddles Doctors : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడికి ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి గుర్తుపట్టలేని పరిస్థితికి చేరాడు. పరిస్థితి విషమించడంతో ఛత్తీస్‌గఢ్ వైద్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి అక్కడి నుంచి బాబును హైదరాబాద్‌కు తీసుకొచ్చి చికిత్స అందించారు. | Read More
ఉమ్మడి వరంగల్‌లో గవర్నర్ పర్యటన - కాకతీయుల శిల్పకళా అందాలకు ఫిదా - Jishnu Dev Varma visit to Warangal
Governor Jishnu Dev Varma Visit 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపద రమణీయంగా ఉందని, ఇదంతా భారతదేశ చారిత్రక సంపదకు నిలయమన్నారు గవర్నర్ జిష్ణుదేవ వర్మ. మరుగున పడుతున్న వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకురావడమే అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న గవర్నర్, ఇవాళ వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, లక్నవరం సరస్సును తిలకించారు. | Read More
హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత- బీఆర్ఎస్ శ్రేణుల ఘనస్వాగతం - MLC KAVITHA REACHED HYDERABAD
MLC Kavitha Reached Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. దిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గులాబీ కార్యకర్తలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సందడిగా మారింది. | Read More
సిద్దిపేట జిల్లాలో దారుణం - దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డగింత - Denial of Temple Entry to Dalits
Denial of Temple Entry to Dalits : నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలోకి దళితులను వెళ్లనివ్వకుండా వేరే కులస్తులు అడ్డుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం గ్రామంలో దళిత కుటుంబాలు యథావిధిగా బోనాల పండుగ జరుపుకునే విధంగా ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. | Read More
ఈనెల 30 నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు - telangana heavy rains
Telangana Weather Report Today : ఈనెల 30 నుంచి తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. | Read More
వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం - నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడి - Minister Ponnam In Vemulawada
Minister Ponnam On Vemulawada Temple : రాబోయే కార్తీక మాసం నాటికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తన వంతు కృషి చేస్తానని తెలిపారు. | Read More
నిండుగా కప్పుకున్నా తప్పుడు చూపే - తేల్చేసిన హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు - Objectification oF Women Research
Hyderabad Students Research on Objectification on Women : సమాజంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు చాలా మంది మాట్లాడేది వాళ్ల వస్త్రధారణ గురించే. కానీ అలాంటి అపోహాలకు తెరదించారు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. మహిళలు, యువతులు నిండు దుస్తులు ధరించిన చాలా సందర్భాల్లోనూ కొంతమంది మగాళ్లు అనుచితంగా చూస్తున్నారని తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. | Read More
రైతులకు గుడ్ న్యూస్ : డ్రాగన్ ఫ్రూట్స్‌తో భారీగా సంపాదించండి- ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది! - Telangana Govt orchard promotion
Telangana Govt orchard promotion : మీరు డిమాండ్ అధికంగా ఉన్న డ్రాగన్ ఫ్రుట్ వంటి పండ్ల తోటలను సాగు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ కథనం మీ కోసమే! రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు సబ్సిడీ అందించనుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. | Read More
బతుకు భారమై విదేశాలకు పయనం - స్వగ్రామానికి తిరిగివస్తుండగా అంతలోనే అంతులేని విషాదం - Woman died bus while return Muscat
AP Woman Dead Due to Heart Attack in Bus : తన పిల్లల భవిష్యత్ కోసం వారిని బాగా చదివించుకోవాలని, భర్తకు సహాయకరంగా ఉండేందుకు మస్కట్‌కు వెళ్లిన ఏపీలోని తూర్పుగోదావరికి చెందిన మహిళ తిరిగి వస్తూ మార్గమధ్యలో బస్సులోనే గుండెపోటుతో మరణించింది. యజమానుల ఇబ్బందులు భరించలేక ఆరోగ్యం క్షీణించడంతో మరో వారం రోజుల్లో తిరిగొస్తోందనేంతలో విగతజీవిగా తిరిగొచ్చిందని ఆ కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. | Read More
నాన్నే నరరూప రాక్షసుడై - కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి - అయిదేళ్ల కుమార్తెపై అత్యాచారం - FATHER RAPES DAUGHTER IN MACHERLA
Macherla Man Rapes Daughter : అమ్మా.. నన్నెందుకు మళ్లీ ఈ రాక్షసుడి దగ్గరికి తీసుకొచ్చావు. నీకు తెలుసు కదా.. ఇతను మనిషి కాదు.. మానవ రూపంలో ఉన్న మృగం అని. నేను పసికందుగా ఉన్నప్పుడే తప్పు దృష్టితో చూశాడని చెప్పావు కదమ్మా. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని నన్ను అలర్ట్ చేశావు. నాన్న మన దగ్గర ఎందుకు లేడు అని అడిగిన ప్రతిసారి.. 'నీకు నాన్న లేడమ్మా.. తనో మృగం' అని చెప్పావు. ఇప్పుడు ఆ మృగం దగ్గరికే నన్ను ఎందుకు తీసుకెళ్లావు. నేను నా స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు కూడా నువ్వు నన్ను ఓ కంట కనిపెట్టుకుని ఉండేదానివి. అలాంటి ఆ కీచకుడి దగ్గరికి నన్ను తీసుకెళ్లినప్పుడు ఎందుకు అప్రమత్తంగా లేవు. అందరికీ నాన్న రక్షణకవచం అంటారే? మరి నా తండ్రేంటమ్మా నన్నే భక్షించాడు. నొప్పిగా ఉందమ్మా నాకు? ఏడుపొస్తోంది? నువ్వైనా చెప్పమ్మా ఆ రాక్షసుడికి నేను కూతుర్ని అవుతాను. నాతో అలా ప్రవర్తించడం తప్పని. కన్నతండ్రి అత్యాచారం చేస్తే తనకేం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఐదేళ్ల పసిపాప అంతరాల్లోని ఆవేదన ఇది. | Read More
ప్రజాపాలన పేరిట ప్రతీకారం - జీతం ఇవ్వడం లేదని వస్తే ఉద్యోగమే ఊడగొట్టారు : కేటీఆర్ - KTR Severely Criticized Prajavani
KTR Comments On Congress Party : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక ఆర్భాటాలు ఎక్కువయ్యాయని, పాలన అటకెక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. | Read More
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ - TELANGANA TALLI STATUE BHOOMI POOJA
Telangana Talli Bhoomi Pooja At Secretariat : రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. | Read More
"కాంగ్రెస్ పాలనలో కర్షకులకు కష్టాలు - పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సామే" - Harish Rao Letter to CM Revanth
Harish Rao Letter to CM Revanth Reddy : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరాక రైతన్నలకు పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సాముగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మద్దతు ధరకు పంటల కొనుగోలును విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. | Read More
డెంగీ రోగుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - లేట్ చేస్తే ప్రాణానికే ముప్పు - PLASMA LEAKAGE IN DENGUE VICTIMS
Plasma Leakage Cases in Dengue Victims : డెంగీ సోకిన వ్యక్తిలో ప్లేట్‌లెట్లు తగ్గడం కంటే ప్లాస్మా లీకేజీ ఎక్కువ ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగుల్లో ప్లాస్మా లీకేజీ జరుగుతున్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గుర్తించిన వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. మరి ఆ లక్షణాలు ఏంటంటే? | Read More
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు నోటీసులు - Revenue Officers Notices To BRS MLA
Hydra Focus On BRS MLA Illegal Assets : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. చిన్న దామెరచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను నిర్మించినందుకుగానూ నోటీసులు జారీచేసినట్లు వివరించారు. | Read More
'ఫారిన్ గర్ల్స్‌తో మాట్లాడతారా? - వారితో ఏకాంతంగా గడపాలా? - ఇక్కడ ప్రతి దానికీ ఒక రేటు' - High Tech Prostitution in Hyderabad
High Tech Prostitution in Hyderabad : అమ్మాయిలతో సరదాగా మాట్లాడతారా! ఆమె నగ్నవీడియోలను ఆస్వాదించాలనుకుంటున్నారా! మీరిద్దరూ ఏకాంతంగా గడపాలని ఆశపడుతున్నారా! ప్రతి దానికీ ఒక రేటు. నిషేధిత వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా అందాలను ఎరవేసి కొందరు అక్రమార్కులు అందినంత దండుకుంటున్నారు. ఇలాంటి హైటెక్ వ్యభిచార గుట్టును హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. విదేశీ యువతులను రప్పించి చీకటి కార్యకలాపాలు సాగిస్తున్న వారి గుట్టురట్టు చేశారు. | Read More
ఇనుప సంకెళ్ల ఉచ్చులో మానసిక దివ్యాంగులు - మూఢనమ్మకానికి బందీలు - దైవాజ్ఞ పేరిట అమానవీయం - INHUMAN INCIDENTS IN WARANGAL
Superstitious Beliefs : వారంతా ఏ తప్పు చేయని అమాయకులు. ఎన్నో ఏళ్లుగా ఇనుప గొలుసులతో బందీలయ్యారు. ఏ చట్టమూ పట్టించుకోని అభాగ్యులు. కాపాడేవారు లేక గొలుసు బందీలుగా స్తంభాలకు వేలాడుతున్నారు. మాకెందుకు ఈ శిక్ష అని ప్రశ్నించలేని మానసిన దివ్యాంగుల పాలిట అయినవారే శాపమయ్యారు. ఈ అమానవీయాన్ని అడ్డుకోని అధికారుల ఉదాసీనతే ఆ అమాయకుల జీవితాన్ని ఛిద్రం చేస్తోంది. | Read More
ఓఆర్‌ఆర్ ఆవలకూ హైడ్రా బుల్డోజర్లు! - విస్తరణ దిశగా సర్కార్ అడుగులు - State Govt Plan To HYDRA Expansion
HYDRA Expansion Proposals : చెరువులు, కుంటల ఆక్రమణలపై కన్నెర్ర చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతోపాటు పరిధిని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసినట్లు సమాచారం. ఓఆర్ఆర్ వరకు ఉన్న హైడ్రా పరిధిని మరో 40 నుంచి 50 కిలోమీటర్లు పెంచాలని భావిస్తున్నారు. హైదరాబాద్ వెలుపల కబ్జాలకు గురవుతున్న చెరువులను, ప్రభుత్వ స్థలాలను రక్షించే అవకాశం లభిస్తుందని యోచిస్తున్నారు. | Read More