ETV Bharat / state

'నన్ను కొట్టి నా భార్యను బలవంతంగా తీసుకెళ్లారు' - సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్​చల్​

పెద్దలకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు - ఉన్నట్టుండి ఓ ఘటనతో మలుపు తిరిగిన ప్రేమ వివాహం - సెల్​ టవర్​ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడు హల్​చల్​

MAN ATTEMPTS SUICIDE FOR WIFE
Man Attempt Suicide from Cell Tower in NTR District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 10:45 PM IST

Man Attempt Suicide from Cell Tower in NTR District : వారిద్దరూ ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. అందుకు తగ్గట్టే పెద్దలకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆపై ఆ దంపతులిద్దరూ సహజీవనం చేస్తూ హాయిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటన వారిని షాక్​కు గురిచేసింది. దీంతో ఆ యువకుడు ఉన్నట్టుండి సెల్​ టవర్​ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా క్రోసూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌ మస్తాన్‌ వలి(22) అనే యువకుడు సెల్​ టవర్​ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్​చల్​ చేశాడు. క్రోసూరు గ్రామానికి చెందిన అతను ఓ యువతిని ప్రేమించి పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ యువతతో కలిసి సహజీవనం చేశాడు.

ఈ క్రమంలో ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలిసి అతడిని బెదిరించడంతోపాటు ఆమెను తీసుకెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన షేక్‌ మస్తాన్‌ వలి సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటున్న తమను విడదీశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను కొట్టి తన భార్యను బలవంతంగా తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశాడు. తన భార్యను తనకు అప్పగించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా అంటూ, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో సెల్​ టవర్​ ఎక్కి అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు.

బంధువుల సమక్షంలో యువకుడికి కౌన్సిలింగ్ : ఈ నేపథ్యంలో అక్కడున్న ప్రజలంతా ఒక్కసారి టవర్​ వద్ద గుమిగూడి అతన్ని కిందకు రప్పించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్​ సిబ్బంది సైతం ఘటనాస్థలాకి చేరుకుని అతడిని సముదాయించారు. డీఎస్పీ హామీ ఇస్తేగానీ కిందకి దిగనని యువకుడు తేల్చిచెప్పాడు. దీంతో సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆ యువకుడు సెల్​ టవర్​ దిగి కిందకు వచ్చాడు. అనంతరం బంధువుల సమక్షంలో యువకుడికి కౌన్సిలింగ్​ ఇచ్చారు. దాదాపు ఆ యువకుడు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు టవర్​పైనే ఉన్నాడు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం - విషయం తెలిస్తే షాక్​ తప్పదు?

భూ సమస్య పరిష్కరించాలంటూ సెల్​టవర్​ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం - Farmer Attempted Suicide From Tower

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.