తెలంగాణ

telangana

By Telangana Live News Desk

Published : 5 hours ago

Updated : 1 minutes ago

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 24 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Tue Sep 24 2024 లేటెస్ట్‌ వార్తలు- డెడ్ లైన్ సమీపిస్తున్నా - ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? : కేటీఆర్ - KTR Tweet on MBBS Admissions

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

12:47 PM, 24 Sep 2024 (IST)

డెడ్ లైన్ సమీపిస్తున్నా - ఈ డైలమాకు తెరదించేదెప్పుడు? : కేటీఆర్ - KTR Tweet on MBBS Admissions

KTR FIRES ON GOVT : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్​, బీడీఎస్​ ప్రవేశాలలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేటీఆర్​ ట్వీట్​ చేశారు. గడిచిన పదేళ్లలో (బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో) ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేదన్నారు. మెడికల్ సీట్ల ప్రవేశాలపై విమర్శలు చేస్తూనే ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. | Read More

ETV Bharat Live Updates - KTR TWEET ON MBBS ADMISSIONS

12:21 PM, 24 Sep 2024 (IST)

శ్రీవారి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి పప్పుబెల్లాల్లా అమ్మేస్తారా? : ఏపీ డిప్యూటీ సీఎం - Pawan Kalyan on TTD Properties

Pawan kalyan on Tirumala Issue : తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి వాటిని పప్పుబెల్లాల్లా అమ్మడానికి గత పాలక మండలి ఎందుకు ఉత్సాహపడిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ ప్రశ్నించారు. గత పాలక మండళ్లకు నేతృత్వం వహించిన వారు శ్రీవారి ఆస్తులను కాపాడారా? అమ్మేశారా అని నిలదీశారు. నిర్ణయాలు తీసుకుందెవరు? ప్రోత్సహించిందెవరో విచారణ చేసి అన్నీ వెలకితీస్తామని వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates - TIRUMALA LADDU CONTROVERSY

12:11 PM, 24 Sep 2024 (IST)

పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? - ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుంటే బెటర్! - Child Adoption Rules in Telugu

Child Adoption Rules : ఈ తరం దంపతులు సంతానలేమి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆరోగ్య సమస్యలతో పాటు ఆహారపు అలవాట్లూ దీనికి కారణమవుతున్నాయి. ఇలా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది పిల్లలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో దత్తత ప్రక్రియను పూర్తిగా తెలుసుకుని, పలు అంశాల గురించి ముందుగానే అవగాహన తెచ్చుకుని, ఇందుకోసం మానసికంగా పూర్తి సంసిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - CHILD ADOPTION RULES IN TELUGU

12:00 PM, 24 Sep 2024 (IST)

మీరు తినే విధానం మీ గురించి మొత్తం చెప్పేస్తుందట! - ఓసారి మీరూ చెక్​ చేసుకోండి - way you eat reveal your personality

Personality Based on Your Eating Style : మీరు తినే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయొచ్చు. అదేంటి మనకు తెలిసిందంతా ముఖ కదలికలను చూసి ఏదైనా చెప్పేయొచ్చని కదా. ఇప్పుడు తినే విధానం కూడా మన గురించి అనేక విషయాలను బయటపెడుతుంది అంటున్నారేంటి? అనుకుంటున్నారా? అలా కూడా చెప్పొచ్చట. అదెలాగో చూసేయండి. | Read More

ETV Bharat Live Updates - EAT REVEALS OUR PERSONALITY

11:39 AM, 24 Sep 2024 (IST)

కూకట్‌పల్లిలో ఐటీ అధికారుల దాడులు - రెయిన్‌బో విస్టాస్‌లో విస్తృత తనిఖీలు - IT Raid in Kukatpally Today

IT Raid in Kukatpally : హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్‌లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెయిన్‌ బో విస్టాస్‌లో నివసిస్తున్న బొల్లా రామకృష్ణ నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. వ్యాపార వ్యవహారాల్లో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడిన కారణంగా సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - IT RAIDS KUKATPALLY

11:14 AM, 24 Sep 2024 (IST)

రోడ్డంతా చేపల మయం - అమ్మేది లేదు, కొనేది లేదు - దొరికినోళ్లకు దొరికినన్ని - Fish Fell on the Road

Fish Fell on the Road in Mahabubabad : రోడ్డంతా చేపలే. మొత్తం జనాలే. మార్కెట్ అనుకుంటే పొరబడినట్టే. మార్కెట్ అస్సలు కాదు. రోడ్డుపై చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడగా అందులో ఉన్న చేపలన్నీ రోడ్డుమయం అయ్యాయి. దీంతో ప్రజలకు ఎగబడి వాటిని తీసుకెళ్లారు. | Read More

ETV Bharat Live Updates - FISH FELL ON ROAD IN MAHABUBABAD

11:02 AM, 24 Sep 2024 (IST)

బిర్యానీ తయారీలో జంతువ్యర్థాల నెయ్యి! - హైదరాబాద్​లో అంతటా ఇదే పరిస్థితి!! - Making Ghee with Animal Waste

Making Ghee with Animal Waste : రాష్ట్రంలో కుళ్లిన జంతు వ్యర్థాలతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు. రాజధానిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ పెద్దఎత్తున ఈ దందా జరుగుతోంది. యథేచ్ఛగా నకిలీ నెయ్యి, నూనెల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం కొంతమంది అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతూ చర్యలు తీసుకోవడం లేదు. | Read More

ETV Bharat Live Updates - USING ANIMAL WASTE FOR GHEE

09:30 AM, 24 Sep 2024 (IST)

ఎంటెక్‌లోనూ అమ్మాయిలదే పైచేయి - ఫస్ట్‌ టైం రికార్డు బ్రేక్ - Girls Top On Mtech Seats

Girls Upper Hand In M.Tech Admissions : తెలంగాణలో ఎంటెక్‌ సీట్లలో అబ్బాయిలను అధిగమించారు అమ్మాయిలు. ఈ విద్యా సంవత్సరంలో ఆయా కోర్సుల్లో చేరిన వారిలో 51.11 శాతం అమ్మాయిలే ఉన్నారు. | Read More

ETV Bharat Live Updates - GIRLS TOP ON MTECH SEATS

07:33 AM, 24 Sep 2024 (IST)

ఓఆర్​ఆర్ పరిధి దాటిన 'హైడ్రా బుల్డోజర్లు' - ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని ఆక్రమణలే లక్ష్యమా? - Hydra Crossed ORR

Hydra Crossed ORR Limits : గ్రేటర్‌ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇకపై ఔటర్ రింగ్‌ రోడ్డు దాటి బుల్డోజర్లతో విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఓఆర్​ఆర్​ బయటి నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హెచ్​ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని ఆక్రమణలను అధికారులు పరిశీలించడంతో హైడ్రా ఔటర్ దాటుతుందనే అంశానికి మరింత బలం చేకూరింది. | Read More

ETV Bharat Live Updates - HYDRA CROSS ORR LIMITS
Last Updated : 1 minutes ago

ABOUT THE AUTHOR

...view details