తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 3 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Tue Sep 03 2024 లేటెస్ట్‌ వార్తలు- వరద మిగిల్చిన దుస్థితి - ఒక్కో వాహనాన్ని బయటకు తీసేందుకు రూ.20 వేలు ఖర్చు - Flood Level Recedes in AP

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Telangana Live News Desk

Published : Sep 3, 2024, 7:20 AM IST

Updated : Sep 3, 2024, 10:00 PM IST

09:59 PM, 03 Sep 2024 (IST)

వరద మిగిల్చిన దుస్థితి - ఒక్కో వాహనాన్ని బయటకు తీసేందుకు రూ.20 వేలు ఖర్చు - Flood Level Recedes in AP

Flood Level Recedes in AP : వరద ఉద్ధృతి తగ్గడం వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముంపునకు గురైన గ్రామాలు క్రమంగా కోలుకుంటున్నాయి. వరద ప్రవాహానికి అనేకచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ సహాయ చర్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు మాట్లాడి ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - AP FLOODS DISASTER

09:35 PM, 03 Sep 2024 (IST)

ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం - Gram Panchayats Merge

Gram Panchayats Merged in Municipalities : ఓఆర్ఆర్ పరిధిలోని మొత్తం 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్​ను విడుదల చేసింది. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. | Read More

ETV Bharat Live Updates - GRAM PANCHAYATS MERGED NEWS

09:35 PM, 03 Sep 2024 (IST)

నిండుకుండలా ఎస్సారెస్పీ - గోదారి పరవళ్లు చూసేందుకు పోటెత్తిన పర్యాటకులు - Heavy Water Inflow to SRSP

Sriram Sagar Project Gates Lifted : ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మూడ్రోజులుగా వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ మొత్తం 41 గేట్ల ద్వారా రెండున్నర లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీరాంసాగర్ గేట్లెత్తడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - SRIRAM SAGAR PROJECT GATES LIFTED

08:08 PM, 03 Sep 2024 (IST)

నీట మునిగిన ఇంట్లో బురదతో బాధితుల ఇబ్బందులు - మున్నేరు శాంతించినా కన్నీరే మిగిలింది - Munneru Flood Effect

Munneru Floods : మున్నేరు వరద తగ్గినా అది మిగిల్చిన బురద మాత్రం ముంపు బాధితులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. చరిత్రలో ఎప్పుడూ రానంత వరద రావడంతో పరీవాహక ప్రాంత కాలనీ వాసులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే కన్నీరే మిగిలింది. పలు కాలనీల్లో మున్నేరు వరద నీరు పది అడుగులకు పైన ప్రవహించడంతో పూర్తిగా ఒక్క రోజు పాటు నీటిలో నానాయి. దీంతో ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బురదను తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నిలిచిన వరద నీటిపై ఆధారపడుతున్నారు. ప్రజల అవస్థలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం. | Read More

ETV Bharat Live Updates - MUNNERU FLOOD NEWS

05:46 PM, 03 Sep 2024 (IST)

"జాతీయ విపత్తు ఎక్కడా ప్రకటించడం లేదు - ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో ఉన్న రూ.1,345 కోట్లను వినియోగించాలి" - Kishan Reddy On Flood Relief Fund

Central Minister Kishan Reddy On Heavy Rains : రాష్ట్రంలో ప్రధానంగా పదకొండు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదల వల్ల చాలావరకూ ఆస్తులు కోల్పోవడం, పంట నష్టం వాటిల్లిందని వివరించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు వచ్చి సమీక్షిస్తాయని వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఎప్పటిలానే అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates - UNION MINISTER KISHANREDDY ON RAINS

04:24 PM, 03 Sep 2024 (IST)

ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ! - ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ - Heavy Rains Alert in Telangana

Rain Alert in Telangana : రాష్ట్రంలో మరో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAIN ALERT IN TELANGANA

04:11 PM, 03 Sep 2024 (IST)

బాలయ్య మంచి మనసు - తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు భారీ విరాళం - BALAKRISHNA DONATES 50 LAKHS TO TG

Balakrishna Flood Donations : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నందమూరి బాలకృష్ణ భారీ విరాళం అందించారు. తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. తన బాధ్యతగా బాధితుల సహాయార్థం విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - BALAKRISHNA DONATES 50 LAKHS TO TG

04:01 PM, 03 Sep 2024 (IST)

గోదావరి ఉగ్రరూపం - తెలంగాణ నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​కు రాకపోకలు నిలిపివేత - TG and MH Road Closed

Maharashtra Road Closed : రాష్ట్రంలో గత మూడ్రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గోదావరిలో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. దీంతో తెలంగాణ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిపేశారు. మరోవైపు తెలంగాణ - ఛత్తీస్​గఢ్ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. | Read More

ETV Bharat Live Updates - TELANGANA AND MAHARASTRA ROAD CLOSE

03:40 PM, 03 Sep 2024 (IST)

ఖమ్మంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ - పువ్వాడ కారుపై రాళ్లతో దాడి - BRS CONGRESS MUTUAL ATTACKS IN KMM

BRS Congress Attacks in Khammam : ఖమ్మం నగరంలో వరద బాధితులను పరామర్శించే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకేసారి రెండు పార్టీల కార్యకర్తలు ఎదురు పడటంతో గట్టిగా నినాదాలు చేసుకుంటూ చివరకు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. | Read More

ETV Bharat Live Updates - BRS CONGRESS ATTACKS IN KHAMMAM

03:00 PM, 03 Sep 2024 (IST)

పేదల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించదు: సీఎం రేవంత్​ - CM Revanth On Mahabubabad Rains

CM Revanth Tour in Mahabubabad : మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో వరదలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. ఇదివరకే మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్న ఆయన, నష్టపోయిన మూడు తండాలవాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. | Read More

ETV Bharat Live Updates - CM REVANTH REVIEW IN MAHABUBABAD

02:49 PM, 03 Sep 2024 (IST)

వారం రోజుల్లో గాంధీలో ఐవీఎఫ్​ సేవలు : మంత్రి దామోదర - Damodara Inspections in Gandhi

Damodara Sudden Inspections in Gandhi Hospital : హైదరాబాద్​లో గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. మందుల కొరతపై అడిగి తెలుసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates - DAMODARA INSPECTIONS IN GANDHI

02:06 PM, 03 Sep 2024 (IST)

వరద ప్రాంతాల్లో రెండోరోజు సీఎం టూర్ - ఆకేరు వాగును పరిశీలించిన రేవంత్ - CM REVANTH VISITS MAHABUBABAD

CM Revanth Mahabubabad District Tour Today : భారీ వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇవాళ (సెప్టెంబరు 3వ తేదీ) ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు. | Read More

ETV Bharat Live Updates - CM REVANTH VISITS MAHABUBABAD

02:04 PM, 03 Sep 2024 (IST)

వరద బాధితుల కోసం కదిలిన ఉద్యోగ జేఏసీ - విరాళంగా రూ.130కోట్లు - TELANGANA EMPLOYEES JAC DONATION

Employee JAC Announced Donation to Telangana : తెలంగాణ వరద బాధితుల కోసం ఉద్యోగుల జేఏసీ సంఘం భారీ విరాళం ప్రకటించింది. బాధితుల క్షేమం కోసం ఒకరోజు వేతనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దాదారు రూ.130 కోట్లు విరాళమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. మహబూబాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళ అంగీకార పత్రం ఇవ్వనున్నట్లు ఈ సంఘం వెల్లడించింది. | Read More

ETV Bharat Live Updates - EMPLOYEES JAC DONATION TO TELANGANA

12:46 PM, 03 Sep 2024 (IST)

ఏడాదిగా ఏం చేస్తున్నారు - చివరి క్షణంలో కోర్టుకు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే ఎలా? : హైకోర్టు - High Court On Ganesh Impression

Telangana High Court On Ganesh Impression : వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి, కోర్టుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన వివాదంపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, ఏటా చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. | Read More

ETV Bharat Live Updates - GANESH IDOL IMPRESSION HUSSAINSAGAR

12:34 PM, 03 Sep 2024 (IST)

'నాకు ఈతరాదు వదిలేయండన్నా ప్లీజ్​' - తాగిన మత్తులో స్విమ్మింగ్ పూల్‌లోకి యువకుడిని నెట్టేసిన సహోద్యోగులు - Birthday Party Death In Ghatkesar

Two Youths Killed Friend in Drunkenness : మద్యం మత్తులో తోటి సహోద్యోగిని బలవంతంగా ఈతకొలనులో నెట్టగా మృతి చెందిన ఘటన ఘట్​కేసర్​ పోలీస్​ స్టేషన్​ పరిదిలో చోటుచేసుకుంది. బాధితుడు తనకు ఈత రాదని ప్రాధేయపడినా వినకుండా మత్తుతో అతన్ని స్విమ్మింగ్ పూల్‌లో పడేశారు. | Read More

ETV Bharat Live Updates - BIRTHDAY PARTY DEATH IN GHATKESAR

12:25 PM, 03 Sep 2024 (IST)

వర్షాల కారణంగా భారీ పంట నష్టం - ప్రాథమిక అంచనా రూ.415 కోట్లు - Huge Crops Loss In Telangana

Flood Effect To Telangana Crops : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు తెలంగాణలో భారీ పంట నష్టం వాటిల్లింది. దాదాపు రూ.415 కోట్ల నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్ఫించింది. | Read More

ETV Bharat Live Updates - CROP LOSS IN TELANGANA

12:07 PM, 03 Sep 2024 (IST)

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పంప్​హౌస్ నీట మునక - దాదాపు 20 కిమీ సొరంగంలో వరద - PALAMURU PUMP HOUSES SUBMERGED

Palamuru-Rangareddy Lift Irrigation Project : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆటంకం కలిగింది. నాగర్​ కర్నూల్​ జిల్లా వట్టెం జలాశయం వద్ద నిర్మించిన పంపు హౌజ్​ నీట మునిగింది. దీంతో 18 నుంచి 20 కిలోమీటర్ల మేర సొరంగం అంతా నీరు చేరింది. | Read More

ETV Bharat Live Updates - PALAMURU RANGAREDDY PROJECT

10:51 AM, 03 Sep 2024 (IST)

చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన 10 మంది - సురక్షితంగా కాపాడిన పోలీసులు - Nagarkurnool Rainy Floods

Fishermen Stuck in a Stream : నాగర్​కర్నూల్ జిల్లా బల్మూరు మండలం సిద్ధాపూర్ శివారు దుందుబి వాగులో చిక్కుకున్న10 మంది చెంచులను అచ్చంపేట, దేవరకొండ పోలీసులు సురక్షితంగా బయటకు తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో తాళ్లు కట్టి పుట్టిల్లో వారిని ఒడ్డుకు చేర్చారు. 2, 3 రోజులుగా ఆహారం లేకపోవడంతో వారికి ఆహారం అందించారు. | Read More

ETV Bharat Live Updates - TEN PEOPLE TRAPPED FLOODS

10:41 AM, 03 Sep 2024 (IST)

గొప్పగా బతుకుదామనుకుని వెళ్లి - నెల రోజుల్లోనే విగతజీవిగా - దుబాయ్​లో మెదక్ వాసి మృతి - Telangana Man Died in Dubai

Medak Gulf Worker Died in Dubai : మెదక్ జిల్లా తిమ్మక్కపల్లి తండాకు చెందిన సూర్య బతుకుదెరువు కోసం దుబాయ్​ వెళ్లి, నెల రోజులు కాకముందే మరణిించాడు. అక్కడ సంపాదించి తిరిగి ఇంటికి వస్తాడనుకున్న భార్యా పిల్లలకు మరణవార్త కన్నీటిని మిగిల్చింది. సూర్య మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సాయం కోరారు. | Read More

ETV Bharat Live Updates - MEDAK GULF WORKER DIED IN DUBAI

10:10 AM, 03 Sep 2024 (IST)

వరద కష్టాలపై స్పందించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ - తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం - NTR Donate 1 Crore to Telugu States

Actor Jr NTR Donates One Crore to Telugu States : తెలుగు రాష్ట్రాలకు జూనియర్​ ఎన్టీఆర్ రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు. | Read More

ETV Bharat Live Updates - TOLLYWOOD ACTOR JR NTR

09:10 AM, 03 Sep 2024 (IST)

ఓవైపు వర్షాలు - మరోవైపు విష జ్వరాలు - ఆసుపత్రుల పాలవుతున్న ఉమ్మడి కరీంనగర్​ వాసులు - Viral Fevers In Karimnagar

Viral Fevers In Karimnagar : వాతావరణంలో మార్పులు, ఆవాసాలు శుభ్రం లేకపోవడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కరోనాతో పాటు డెంగీ జ్వరాల ఆందోళన ప్రజల్లో పెరిగింది. డెంగీ జ్వర నిర్ధారణ కేవలం ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే జరగాలన్న నిబంధనతో జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వందల సంఖ్యలో జ్వర పీడితులు ఆసుపత్రుల్లో చేరుతున్నా, ఔషధాల కొరత మాత్రం వెంటాడుతోంది. ఆస్పత్రిలో రాసే ప్రిస్క్రిప్షన్‌లో ఒకటి రెండు ఔషదాలు మాత్రమే ఉచితంగా ఇస్తూ, మిగతా వాటిని మాత్రం ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. | Read More

ETV Bharat Live Updates - VIRAL FEVERS IN KARIMNAGAR

08:54 AM, 03 Sep 2024 (IST)

కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద - వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల - Flood Flow Of Krishna Project

Flood Flow Of Krishna Project : కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం, నాగార్జున్ సాగర్ జలాశయాలు గతంలోనే పూర్తి సామర్థ్యానికి చేరుకోగా, ఎగువ నుంచి వచ్చిన నీటినంతటినీ పూర్తిగా దిగువకు వదులుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - PROJECTS GATES OPENED IN TELANGANA

08:48 AM, 03 Sep 2024 (IST)

కాస్త తగ్గుముఖం పట్టిన వర్షాలు - క్షేత్రస్థాయిలో బాధితులకు భరోసా కల్పిస్తున్న అధికారులు - Heavy Rains In Telangana

Roads Damaged Due to Heavy Rains in Telangana : రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. వరద తీవ్రతకు పలుచోట్ల రోడ్లు దెబ్బతినగా, అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటమునిగిన ప్రాంతాలు సహా దెబ్బతిన్న వాగులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరదల కారణంగా అల్లాడిపోయిన బాధిత ప్రజలను పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN TELANGANA

08:37 AM, 03 Sep 2024 (IST)

'మున్నేరు' మిగిల్చిన విషాదం : ఆనవాళ్లను కోల్పోయిన ఆవాసాలు - కట్టుబట్టలతో రోడ్డునపడ్డ బాధితులు - Munneru Flood in Khammam

Munneru Flood in Khammam : శనివారం రాత్రి వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాతే అసలైన విధ్వంసం జరిగింది. అదే మున్నేరు వాగు మహోగ్రరూపం. మున్నేరు ఉగ్రరూపానికి ముంపు ప్రాంతాలు హడలిపోయాయి. శాంతం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. | Read More

ETV Bharat Live Updates - MUNNERU IN SPATE IN KHAMMAM

07:32 AM, 03 Sep 2024 (IST)

వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణను ఆదుకోండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి - CM Tour In khammam

CM Tour in khammam : వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల దాటికి రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా ఉందని, ఆ మొత్తాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిన ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రతిపక్ష పార్టీ వరదలతో బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. | Read More

ETV Bharat Live Updates - CM REVANTH ON FLOODS IN TELANGANA

07:11 AM, 03 Sep 2024 (IST)

అపార నష్టాన్ని మిగిల్చిన కుండపోత వర్షం - ఈ 11 జిల్లాల్లో నేడు మళ్లీ భారీ వర్షాలు - TG Govt Alert Heavy Rains Today

TG Govt Alert Heavy Rains Today : రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు నేలమట్టమై విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. తాగు నీటి సమస్యలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. వరదల్లో చిక్కుకుని 21 మంది మృత్యువాతపడ్డారు. నేడూ వర్షాలు కురుస్తాయన్న వాతారవణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAIN ALERT IN TELANGANA
Last Updated : Sep 3, 2024, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details