తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 29 August 2024 

Telangana News Today Live : తెలంగాణ Thu Aug 29 2024 లేటెస్ట్‌ వార్తలు- ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల వ్యవహారం - వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు - High Court On Engineering Seats

By Telangana Live News Desk

Published : Aug 29, 2024, 8:00 AM IST

Updated : Aug 29, 2024, 10:00 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

09:58 PM, 29 Aug 2024 (IST)

ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల వ్యవహారం - వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు - High Court On Engineering Seats

High Court On Engineering College Seats : ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించిన అనుమతుల నిరాకరణపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. | Read More

ETV Bharat Live Updates - HIGH COURT ENGINEERING SEATS ISSUE

09:59 PM, 29 Aug 2024 (IST)

ఇకపై రెవెన్యూ నోటీసులే షోకాజ్‌ నోటీసులు - హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు - TG HIGH COURT ON REVENUE NOTICES

Telangana HC on Revenue Notices : నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు నిమిత్తం రెవెన్యూ శాఖ ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే చట్ట ప్రకారం ముందుకెళ్లాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. | Read More

ETV Bharat Live Updates - TELANGANA HC ON HYDRA NOTICES

08:15 PM, 29 Aug 2024 (IST)

ఏఐ సిటీగా అమరావతిని రూపొందించండి - అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు - Chandrababu Review On Amaravati

AP CM Chandrababu Review On Capital : ఏపీలో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం 90 రోజుల్లో పూర్తి కావాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఆదేశించారు. కార్మికుల క్షేమం, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. త్వరలో చంద్రన్న బీమాకు శ్రీకారం చుడతామని అన్నారు. | Read More

ETV Bharat Live Updates - CM CHANDRABABU REVIEW ON CAPITAL

07:59 PM, 29 Aug 2024 (IST)

హైడ్రా మరో కీలక నిర్ణయం - అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు - HYDRA action against officials

Hydra Demolishing Illegal Structures New Decision : చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనధికారిక నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆరుగురు అధికారులపై కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్​కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీరుపారుదల, మున్సిపల్ శాఖల్లో అక్రమ అనుమతులపై జాబితాను హైడ్రా సిద్దం చేసింది. శాఖల వారీగా అవినీతి అదికారులపై క్రిమినల్​ కేసులు నమోదు చేయబోతుంది. | Read More

ETV Bharat Live Updates - HYDRA KEY DECISION

07:31 PM, 29 Aug 2024 (IST)

బాధ్యత కలిగిన సీఎంగా చేయాల్సిన వ్యాఖ్యలేనా? - రేవంత్​ రెడ్డిపై సుప్రీం ఫైర్ - Supreme Court Fires on CM Revanth

Supreme Court Objection on CM Revanth : కవితకు బెయిల్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేయాల్సిన వ్యాఖ్యలేనా? అని ప్రశ్నించింది. | Read More

ETV Bharat Live Updates - SUPREME COURT OBJECTION CM REVANTH

07:17 PM, 29 Aug 2024 (IST)

పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్దం చేయండి - అధికారులకు ఎస్ఈ​సీ ఆదేశం - SEC Meeting on Panchayat Elections

Telangana Panchayat Elections : మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితాను తయారు చేయాలని అధికారులకు ఈసీ ఆదేశాలిచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా పంచాయతీలు, వార్డుల వారీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథి తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - TELANGANA PANCHAYAT ELECTIONS

06:14 PM, 29 Aug 2024 (IST)

హీరోయిన్‌ వేధింపుల కేసులో విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం - ముంబయికి పోలీస్ బృందాలు - Mumbai Actress Case Updates

Investigation on Mumbai Actress Issue : ముంబయి హీరోయిన్‌పై వేధింపుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే విజయవాడ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందాలు ముంబయి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ వ్యవహారంపై పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - MUMBAI ACTRESS CASE

04:49 PM, 29 Aug 2024 (IST)

జనగామ కలెక్టరేట్‌ను సందర్శించిన గవర్నర్‌ - సంక్షేమం గురించి వివరించిన అధికారులు - Governor visited Jangaon

Governor Jishnu Dev Varma Visit To Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్టు దేవ్ వర్మ జనగామ జిల్లాకు చేరుకున్నారు. అక్కడి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నాయకులు, అధికారులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య సదుపాయాల గురించి అధికారులు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. | Read More

ETV Bharat Live Updates - GOVERNOR VISITED JANGAON

04:30 PM, 29 Aug 2024 (IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం - రానున్న 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు! - IMD ALERT TO TELANGANA

IMD Alert to Telangana : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడిందని, దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. | Read More

ETV Bharat Live Updates - RAIN ALERT IN TELANGANA

04:33 PM, 29 Aug 2024 (IST)

'హైడ్రా' నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి - ఏమన్నారంటే? - CM brother reacts on Hydra notices

CM Brother Reacts on Hydra Notices : బీఆర్ఎస్ నాయకులు తనను లక్ష్యంగా చేసుకుని దుర్గం చెరువు అమర్ సొసైటీలోని నివాసితులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆరోపించారు. తన నివాసం బఫర్ జోన్‌లో ఉందని నోటీసులు అందాయని, నిబంధనల ప్రకారం లేకుంటే తన ఇంటిని కూల్చేయొచ్చని స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates - TIRUPATHI REDDY ON HYDRA NOTICES

04:28 PM, 29 Aug 2024 (IST)

'ఓఆర్ఆర్ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత హైడ్రాదే - త్వరలో మార్గదర్శకాలు' - Tg CS Review on Hydra demolitions

Hydra demolitions in Hyderabad : ఓఆర్​ఆర్​ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత హైడ్రాదేనని సీఎస్​ శాంతి కుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి, విధివిధానాలను తయారు చేయాలని సంబంధిత శాఖను ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates - HYDRA DEMOLITIONS

03:16 PM, 29 Aug 2024 (IST)

వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్​రావు రాజీనామా - టీడీపీలో మోపిదేవి చేరిక ఖాయం - Beeda Masthan Rao Resign MP

YSRCP MPs Resign : ఏపీలో అధికారం కోల్పోయాక వైఎస్సార్సీపీకి వరుస షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు రాజీనామా చేయగా, మరికొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా ఎంపీ పదవులకు మోపిదేవి, బీద మస్తాన్​రావు రాజీనామా చేశారు. | Read More

ETV Bharat Live Updates - YSRCP MPS RESIGN

12:12 PM, 29 Aug 2024 (IST)

ఈ బొక్కలో పంచాయితీ ఏంట్రా బాబు? - పెళ్లిలో మటన్ ముక్కల కోసం కొట్లాట - FIGHT OVER MUTTON IN WEDDING

Grooms Family Fights For Mutton in Marriage : మటన్ ముక్కల కోసం వరుడు, వధువు తరఫు బంధువులు దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా​ నవీపేట మండలంలో చోటుచేసుకుంది. చివరికి పోలీసులు వచ్చి పంచాయితీ తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. | Read More

ETV Bharat Live Updates - FAMILY FIGHT FOR MUTTON IN MARRIAGE

12:07 PM, 29 Aug 2024 (IST)

ఓటుకు నోటు కేసు అప్డేట్ - విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు - SC on Note for Vote Case

SC on Note for Vote Case Update : ఓటుకు నోటు కేసు ట్రయల్ బదిలీ చేయాలని మాజీమంత్రి జగదీశ్​ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు పిటిషన్​ను రద్దు చేసింది. | Read More

ETV Bharat Live Updates - SC ON REVANTH NOTE FOR VOTE CASE

11:53 AM, 29 Aug 2024 (IST)

'వద్దురా నాయనా కాంగ్రెస్ సర్కార్ - రుణమాఫీ లేదు - రైతు భరోసా రాదు' - KTR TWEETS TODAY LATEST NEWS

KTR Tweets Today On Govt : రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తోందని మాజీమంత్రి కేటీఆర్​ మండిపడ్డారు. రుణమాఫీ చెయ్యలేక డ్రామా షురూ చేశారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా ​ప్రభుత్వాన్ని విమర్శించారు. | Read More

ETV Bharat Live Updates - KTR TWEET ON LOAN WAIVER

10:47 AM, 29 Aug 2024 (IST)

వృద్ధులపై సైబర్ కేటుగాళ్ల 'డిజిటల్ అరెస్టు' అస్త్రం - అసలు ఏంటిది? - WHAT IS DIGITAL ARREST IN TELUGU

What Is Digital Arrest in Telugu: ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ అరెస్టు చేసి సైబర్ నేరగాళ్లు సొమ్మును కాజేశారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే చాలామంది డిజిటలే కదా ఈజీగా తప్పించుకోవచ్చు అని అనుకుంటారు. సైబర్ నేరగాళ్లు పాల్పడే డిజిటల్ అరెస్ట్ వాస్తవికత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates - SPECIAL STORY ON DIGITAL ARREST

10:06 AM, 29 Aug 2024 (IST)

అమెరికాలో అమ్మ భాష - విదేశీ గడ్డపై వికసిస్తున్న అఆఇఈ - Teaching Telugu in Abroad

Learning Mother Tongue in Abroad : విదేశాల్లోనూ మాతృభాష ప్రకాశిస్తోంది. తెలుగు వాళ్లు వారి పిల్లలకు మాతృభాషను ఒంటపట్టిస్తున్నారు. సిలికానాంధ్ర, తానా వంటి సంస్థలు సైతం విదేశాల్లో మన తెలుగుభాషను పరిరక్షించేందుకు పాటుపడుతున్నాయి. ఆయా సంస్థల కృషితో మన సంస్కృతి పరిఢవిల్లుతోంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలు మననం చేసుకుందాం. | Read More

ETV Bharat Live Updates - TEACHING TELUGU IN AMERICA

10:03 AM, 29 Aug 2024 (IST)

సీఎం రేవంత్ సోదరుడికి 'హైడ్రా' షాక్.. నోటీసులు జారీ.. నెలలోగా ఇంటిని కూల్చేయాలని అల్టిమేటమ్ - Hydra Notices To CM Revanth Brother

Hydra Notices to CM Revanth Reddy Brother : హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తోంది. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికే నోటీసులు ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates - HYDRA NOTICES TO CM REVANTH BROTHER

09:37 AM, 29 Aug 2024 (IST)

జహీరాబాద్‌కు మహర్దశ - రూ. 2,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ - INDUSTRIAL SMART CITY IN ZAHEERABAD

Zaheerabad Industrial City : పారిశ్రామికాభివృద్ధి దిశగా మరో మెగా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మోదీ సర్కార్‌ ప్రకటించింది. 3 వేలకు పైగా ఎకరాల్లో 2 వేల 361 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురానుంది. లక్షా 74వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కేంద్రం ప్రకటించి పారిశ్రామిక పార్కు వల్ల జహీరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయని స్థానిక పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - CENTRAL ON SMART CITY IN ZAHEERABAD

08:45 AM, 29 Aug 2024 (IST)

ప్రేమ కత్తికి మరో ప్రాణం బలి - ఉన్మాది దాడిలో యువతి మృతి - HYDERABAD MAN KILLS EX GIRLFRIEND

Man Kills A Young Woman For Marriage : ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి చెందిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పరిధి గోపన్​పల్లిలో కలకలం రేపింది. కాగా దాడిని అడ్డుకున్న మరో ముగ్గురు కూడా గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - HYDERABAD MURDER CASE

08:13 AM, 29 Aug 2024 (IST)

సైబర్ కేటుగాళ్లతో బ్యాంక్ మేనేజర్ డీలింగ్స్ - రూ.175 కోట్లు చైనాకు హవాలా - HYD SBI BRANCH 175 CRORES FRAUD

Bank Manager Involved In Cyber Crime : సైబర్‌ నేరాల్లో దోచేసిన డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో దేశం దాటిస్తూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నేరగాళ్లు పెరిగిపోయారు. కాసులకు కక్కుర్తి పడి సైబర్‌ కేటుగాళ్లకు కొందరు బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన క్యాబ్‌, ఆటో డ్రైవర్లను పావులుగా వాడుకుంటున్నారు. సైబర్‌ నేరగాళ్లతో బ్యాంక్‌ మేనేజర్‌ కుమ్మక్కవ్వడం కలకలం రేపుతోంది. | Read More

ETV Bharat Live Updates - BANK MANAGER ARREST IN FRAUD CASE

08:08 AM, 29 Aug 2024 (IST)

కేబుల్‌ టీవీ రంగంలో కొత్త సాంకేతికత - హైటెక్స్‌లో మూడ్రోజులపాటు ఎక్స్‌పో - 12th CNC Expo 2024

12th Cable Expo at Hitech City : సినిమాలు, వార్తలు, వినోదం సహా మరెన్నో కార్యక్రమాలను ఇంటింటికి చేర్చడంలో కేబుల్‌ కనెక్షన్లది కీలక పాత్ర. అన్ని రంగాల్లో లాగే కేబుల్‌ టీవీ రంగంలోనూ ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఆప్టికల్‌ ఫైబర్ కేబుళ్ల రాకతో ఇంట్లోనే టీవీ ప్రసారాలతోపాటు ఇంటర్నెట్‌ ద్వారా కంప్యూటర్‌, ఇతర పరికరాలను వాడే సౌలభ్యం వచ్చింది. కేబుల్‌, ఓటీటీ, డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలలో వచ్చిన కొత్త టెక్నాలజీ, ఉత్పత్తులకు కేబుల్‌ ఎక్స్‌పో వేదికైంది. హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిన్న ప్రారంభమైన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది. | Read More

ETV Bharat Live Updates - CABLE EXPO SEMINAR AT HITECH CITY

07:10 AM, 29 Aug 2024 (IST)

ఆర్ఆర్ఆర్​ అలైన్​మెంట్​పై సీఎం రేవంత్ సమీక్ష - పలు కీలక అంశాలపై అధికారులకు ఆదేశాలు - CM Revanth Review on Fourth City

CM Revanth Reddy Review On RRR Alignment : రీజిన‌ల్ రింగు రోడ్డు ద‌క్షిణభాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే విధంగా ఉండాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియ‌ల్ రోడ్లకు భూస‌మీక‌ర‌ణ వేగ‌వంతం చేయాలని ఆదేశించారు. డ్రైపోర్ట్, బంద‌రు-కాకినాడ రేవుల అనుసంధానంపై అధ్యయ‌నం చేయాలన్నారు. అట‌వీ ప్రాంతాల్లో నైట్ సఫారీల‌కు కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించాలని సీఎం తెలిపారు. ఆర్ఆర్ఆర్‌ ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేలా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. | Read More

ETV Bharat Live Updates - CM REVANTH REVIEW ON FOURTH CITY
Last Updated : Aug 29, 2024, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details