తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 1 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Sun Sep 01 2024 లేటెస్ట్‌ వార్తలు- విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు - 'సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఇక్కడే ఉంటా' - ap cm babu Inspected

By Telangana Live News Desk

Published : Sep 1, 2024, 8:25 AM IST

Updated : Sep 1, 2024, 10:33 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:30 PM, 01 Sep 2024 (IST)

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు - 'సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఇక్కడే ఉంటా' - ap cm babu Inspected

Chandrababu Inspected With Flood Areas: ఏపీలోని విజయవాడలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం పడవలో వెెళ్లి వరద ప్రాంతాలను పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లక్ష మందికి సరిపోయేలా ఆహారం సరఫరా చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. | Read More

ETV Bharat Live Updates - CBN INSPECTED FLOOD AREAS IN BOAT

10:19 PM, 01 Sep 2024 (IST)

రేవంత్ రెడ్డికి అమిత్​ షా ఫోన్, అండగా ఉంటామని భరోసా - Amit shah Call To CM Revanth

Union Home Minister Call To CM Revanth : రాష్ట్రంలో వరద తీవ్రతపై కేంద్రం స్పందించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం తరపున అన్ని రకాల సాయం అందిస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates - AMIT SHAH PROMISE TO AID

10:04 PM, 01 Sep 2024 (IST)

సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్​ క్లోజ్​! - ప్రయాణం వాయిదా బెస్ట్ - Hyd to Vijayawada highway closed

Hyderabad to Vijayawada traffic stopped : సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూర్యాపేట ఎస్పీ సన్​ప్రీత్​ సింగ్​ అన్నారు. | Read More

ETV Bharat Live Updates - HYD TO VIJAYAWADA TRAFFIC STOPPED

07:12 PM, 01 Sep 2024 (IST)

వరద నీటిని వృథా చేయొద్దు - రిజర్వాయర్లకు ఏకధాటిగా లిఫ్టింగ్‌ చేయాలని రేవంత్ ఆదేశం - CM Revanth Review on Water Pumping

CM Revanth Review on Water Pumping : భారీవర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ఆయన సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates - TELANGANA RAINS 2024

07:06 PM, 01 Sep 2024 (IST)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత వానలు, వరద గుప్పెట్లో ఊళ్లు - జలదిగ్బంధంలో వందలాది ఇళ్లు - Heavy Rains in Khammam 2024

Heavy Rains in Khammam 2024 : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద బీభత్సంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగుల ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. | Read More

ETV Bharat Live Updates - KHAMMAM FLOODS 2024

05:50 PM, 01 Sep 2024 (IST)

తెలంగాణలో భారీ వర్షాలకు 9 మంది మృతి : మంత్రి పొంగులేటి - 9 People Died Due to Rains in tg

Heavy Rains in Telangana : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - TELANGANA RAINS

05:38 PM, 01 Sep 2024 (IST)

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు - వరదలకు కొట్టుకుపోయి ఐదుగురు మృతి - Five People Died Due to Rains

Heavy Rains in Warangal District : ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షానికి ఐదుగురు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందారు. | Read More

ETV Bharat Live Updates - FIVE PEOPLE DIED IN WARANGAL

05:22 PM, 01 Sep 2024 (IST)

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి - హుటాహుటిన నీటిని ఆపేసిన అధికారులు - Nagarjuna Sagar Left Canal Cut Off

Nagarjuna Sagar Left Canal Breached : నాగార్జున సాగర్ ప్రధాన ఎడమ కాలువకు గండి పడింది. పాలేరు ఎగువన 133.06 కి.మీ. వద్ద సాగర్‌ ఎడమ కాలువ తెగిపోయింది. దీంతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గండిపడటంతో హుటాహుటిన ఎడమ కాలువకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. | Read More

ETV Bharat Live Updates - NAGARJUNA SAGAR LEFT MAIN CANAL

05:04 PM, 01 Sep 2024 (IST)

భారీ వర్షాలు: తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు బంద్‌ - Buses close between Hyd Vijayawada

Buses Stop Between AP And Telangana : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో ఐతవరం వద్ద ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు బందయ్యాయి. | Read More

ETV Bharat Live Updates - HYDERABAD VIJAYAWADA BUSSES STOPED

05:00 PM, 01 Sep 2024 (IST)

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం - ఒక్కరోజులోనే ఎంత వర్షపాతమో తెలుసా? - record rainfall in krishna district

Heavy Rain in Krishna District : భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా తడిసిముద్దయింది. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, వీధులు, రహదారులు నీటమునిగాయి. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ జలజీవనం స్తంభించింది. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN KRISHNA DISTRICT

04:38 PM, 01 Sep 2024 (IST)

హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం - Heavy Rain Effect In Hyderabad

Heavy Rain Effect In Hyderabad : భారీ వర్షాలకు హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​ నీటిమట్టం పెరిగి నిండుకుండలా మారింది. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates - HUSSAIN SAGAR WATER LEVEL INCREASED

04:18 PM, 01 Sep 2024 (IST)

రెయిన్ ఎఫెక్ట్ : విద్యుత్ సమస్యలకు టోల్​ ఫ్రీ నెంబర్, నీటిపారుదల శాఖలో సెలవులు రద్దు - Ministers Review on Rains

Ministers Review on Rains in Telangana : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు అప్రమత్తమయ్యారు. ఇవాళ ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రజలకు అననునిత్యం అందుబాటులో ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. | Read More

ETV Bharat Live Updates - TELANGANA RAINS 2024

03:09 PM, 01 Sep 2024 (IST)

మున్నేరు వాగు బీభత్సం - కాలనీల్లో 28 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద నీరు - Munneru Vagu Heavy Flood

Munneru Vagu Water Folw Raising High : ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు మహోగ్రరూపం దాల్చుతూ ప్రవహిస్తోంది. ఈ ప్రవాహానికి మున్నేరు పరివాహక కాలనీలు జలమయం అయ్యాయి. | Read More

ETV Bharat Live Updates - MUNNERU VAGU

02:52 PM, 01 Sep 2024 (IST)

రెయిన్‌ ఎఫెక్ట్ : విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం - HOLIDAY FOR SCHOOLS

HOLIDAY FOR SCHOOLS : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకి రావొద్దని స్పష్టం చేసింది. | Read More

ETV Bharat Live Updates - HOLIDAY FOR EDUCATIONAL INSTITUTION

02:26 PM, 01 Sep 2024 (IST)

పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు - ముంబయి నటి వాంగ్మూలంలో కీలక విషయాలు - mumbai actress case

MUMBAI ACTRESS CASE: ముంబయి నటి కేసులో నకిలీ పత్రాలు సృష్టించిన పోలీసులకు ఉచ్చు బిగుస్తుంది. రెండో రోజూ హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు స్టేట్ మెంట్​ను రికార్డ్ చేసుకున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనపై కేసు నమోదు చేయటం వెనుక కుట్ర ఉందని నటి పోలీసులకు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - ముంబయి సినీనటి కేసు

02:04 PM, 01 Sep 2024 (IST)

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ - SCR Cancelled Trains

SCR Cancelled Trains : భారీ వర్షాలతో కాజీపేట సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో హైదరాబాద్ -విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్లు రద్దు కావడంతో దూరం వెళ్లే ప్రయాణికులు పలు రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయారు. దీంతో ప్రయాణికులను బస్సుల్లో తరలించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

01:24 PM, 01 Sep 2024 (IST)

భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - పరీవాహక ప్రాంత వాసుల్లో టెన్షన్​, టెన్షన్ - Godavari River Water Level Rises

Godavari River Water Level Rises : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. | Read More

ETV Bharat Live Updates - GODAVARI WATER INCREASE

01:13 PM, 01 Sep 2024 (IST)

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో దంచికొడుతున్న వానలు- ఎక్కడికక్కడ నిలిచిపోయిన రాకపోకలు - heavy rains in joint Mahabubnagar

Heavy Rains in Mahabubnagar : వాయిగుండం ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నరాత్రి నుంచి ఎడతెరపిలేని వానలు కురుస్తూనే ఉన్నాయి. భారీవర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఐదు జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కంట్రోల్ రూమ్ (08542- 2241165), వనపర్తి జిల్లా కంట్రోల్ రూం (08545-233525), (08545-220351), నాగర్ కర్నూల్ జిల్లా కంట్రోల్ రూం (08540-230201) సహాయం కోసం సంప్రదించాలని సూచించారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN PALAMURU DISTRICT

01:09 PM, 01 Sep 2024 (IST)

ఉమ్మడి నల్గొండ జిల్లాను వణికిస్తున్న వరుణుడు - కోదాడలో వరద నీటిలో 2 మృతదేహాలు లభ్యం - Heavy Rains in Nalgonda District

Rains in Nalgonda District : ఉమ్మడి నల్గొండ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు. కుండపోత వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతికి జిల్లాలోని మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAIN IN NALGONDA

12:43 PM, 01 Sep 2024 (IST)

ఉమ్మడి మెదక్​ జిల్లాలో వరుణుడి బీభత్సం - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - ఇళ్లల్లోకి వరద నీరు - Heavy Rains in Medak District

Heavy Rains in Medak District : ఉమ్మడి మెదక్​ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు. కుండపోత వానకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులను తలపించేలా రహదారులు మారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా పాతూరులో 20.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINFALL IN MEDAK DISTRICT

12:09 PM, 01 Sep 2024 (IST)

భారీ వర్షాలపై సీఎం రేవంత్‌ అత్యవసర సమీక్ష- అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశం - CM REVANTH EMERGENCY REVIEW

CM Revanth Review on Rains : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలని సీఎం స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates - CM EMERGENCY REVIEW ON RAINS

12:01 PM, 01 Sep 2024 (IST)

రాష్ట్రంలో ఇవాళ, రేపు కుండపోత వర్షాలు - 33 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ - telangana weather report

Heavy Rains in Telangana : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను వాతావరణశాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. | Read More

ETV Bharat Live Updates - IMD ISSUED RED ALERT TO TELANGANA

11:34 AM, 01 Sep 2024 (IST)

హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం - మూసీ నదికి పోటెత్తిన వరద ప్రవాహం - Heavy Flood Water To Yadadri Musi

Heavy Flood Water To Yadadri Musi River : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. ఉదయం కురిసిన వర్షానికి, హైదరాబాద్​ మూసీ నది నుంచి వస్తున్న వరద కారణంగా భారీగా ప్రవహిస్తోంది. మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో సంగెం గ్రామ సమీపంలోని బ్రిడ్జికి ఇరు వైపులా వాహనాలను పోలీసులు నిలిపివేశారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY FLOOD WATER TO YADADRI

09:59 AM, 01 Sep 2024 (IST)

భారీ వరదకు ఇంటికన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసం - నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు - Heavy Rain in Mahabubabad

Rain in Mahabubabad Today : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఇనుగుర్తిలో అత్యధికంగా 29.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో మహబూబాబాద్-నెల్లికుదురులతో పాటు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రావిరాలలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. | Read More

ETV Bharat Live Updates - RAIN ALERT IN MAHABUBABAD

09:37 AM, 01 Sep 2024 (IST)

'2018' సీన్​ రిపీట్! - వరద గుప్పెట్లో మణుగూరు - నీట మునిగిన భవనాలు - Heavy Rain in Bhadradri

Heavy Rain in Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో మణుగూరు పట్టణం వరద గుప్పెట్లో చిక్కుకుంది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మణుగూరు పట్టణం వరద ముంపునకు గురైంది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - RAIN IN BHADRADRI KOTHAGUDEM

09:15 AM, 01 Sep 2024 (IST)

ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతోన్న వరద నీరు - నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత - Sagar 26 Gates Opened

Projects Gates Opened in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయాల గేట్లు ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్​లో 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం జలాశయంలో భారీగా వరద నీరు వస్తుండడంతో 10 గేట్లు ఎత్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ 16 గేట్లు ఎత్తి 1 లక్ష 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - NAGARJUNA SAGAR GATES OPENED

09:05 AM, 01 Sep 2024 (IST)

నారాయణపేట జిల్లాలో విషాదం - భారీ వర్షానికి ఇంటి గోడ కూలి తల్లీకుమార్తె మృతి - Two People Died Due To Rains

Two People Died After Wall Collapsed Due To Rains : నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎక్కమేడ్ గ్రామంలో విషాదం నెలకొంది. భారీ వర్షాల కారణంగా గోడ కూలి ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకుమార్తె మృతి చెందారు. | Read More

ETV Bharat Live Updates - THE HOUSE COLLAPSED AND TWO DIED

08:42 AM, 01 Sep 2024 (IST)

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - heavy rains in vijayawada

Heavy Rains in Vijayawada : రెండు దశాబ్ధాలుగా ఎప్పుడూ నమోదుకానంతంగా కురిసిన వర్షానికి విజయవాడ నగరం వణికిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN ANDHRA PRADESH

07:38 AM, 01 Sep 2024 (IST)

అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన వారిపై హైడ్రా చర్యలు - త్వరలోనే మరింత మందిపై కేసులు! - Hydra Registered Cases

Hydra Registered Cases Against Officers In Hyderabad : హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సైబరాబాద్‌ పోలీసులు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్​టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు వారిపై చర్యలు చేపట్టాలని 2 రోజుల క్రితం హైడ్రా సిఫారసు చేసింది. ఇదే తరహాలో అక్రమార్కులకు సహకరించిన మరికొంత మంది అధికారులపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమతున్నట్లు తెలుస్తోంది. | Read More

ETV Bharat Live Updates - HYDRA REGISTERED CASES

06:38 AM, 01 Sep 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు - లోతట్టు ప్రాంతాలు జలమయం - స్తంభించిన జనజీవనం - Heavy Rain in Telangana

Rain Across Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వానాలకు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAIN IN TELANGANA

06:45 AM, 01 Sep 2024 (IST)

హైదరాబాద్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు - Heavy Rains In Hyderabad

Heavy Rains In Hyderabad : బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా హైదరాబాద్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. హైదరాబాద్‌లోని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్‌ సోమవారం సెలవు ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates - HYDERABAD RAINS
Last Updated : Sep 1, 2024, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details