తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 31 August 2024 

Telangana News Today Live : తెలంగాణ Sat Aug 31 2024 లేటెస్ట్‌ వార్తలు- హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు - కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌ - Vehicles Stuck at Kodada highway

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Telangana Live News Desk

Published : Aug 31, 2024, 7:00 AM IST

Updated : Aug 31, 2024, 10:54 PM IST

10:52 PM, 31 Aug 2024 (IST)

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు - కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌ - Vehicles Stuck at Kodada highway

Vehicles Stuck at Kodada due to Flooding : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పొటెత్తడంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. గంటల కొద్ది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను అధికారులు వెరే మార్గాలకు మళ్లించారు. | Read More

ETV Bharat Live Updates - VEHICLES STUCK AT KODADA

09:23 PM, 31 Aug 2024 (IST)

పేరేమో ఉత్తమ్ కుమార్ – మాట తీరేమో మూసీ ప్రవాహం : కేసీఆర్‌పై విమర్శలకు హరీశ్‌రావు కౌంటర్ - Harish rao slams Minister Uttam

Harish rao slams Minister Uttam Kumar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ను డెకాయిట్ అంటూ నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రిని అలా సంభోదించడం, మంత్రి ఉత్తమ్ దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. | Read More

ETV Bharat Live Updates - HARISH RAO VS MINISTER UTTAM KUMAR

07:47 PM, 31 Aug 2024 (IST)

'వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు' - కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశం - CS TeleConference With Collectors

CS Shanthi Kumari Teleconference With Collectors : వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను సీఎస్​ శాంతి కుమారి ఆదేశించారు. తెలంగాణ రెడ్​ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. | Read More

ETV Bharat Live Updates - CS TELECONFERENCE WITH COLLECTORS

07:19 PM, 31 Aug 2024 (IST)

విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు : హరీశ్‌రావు - HARISH RAO SLAMS CM REVANTH REDDY

Harish rao Slams CM Revanth : ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే సర్కారు పాఠశాలలు అధ్వాన్నంగా మారాయని మాజీ మంత్రి హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయన మండిపడ్డారు. | Read More

ETV Bharat Live Updates - HARISH RAO FIRES ON CONGRESS GOVT

05:31 PM, 31 Aug 2024 (IST)

హైదరాబాద్ - నాగార్జునసాగర్‌ మధ్య 4 వరుసల రోడ్డుకు ప్రభుత్వం ప్రతిపాదన - TG GOVT KEY DECISIONS ON TOURISM

Tourism Development in Telangana : రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక స్థలాల అభివృద్ధికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్, హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం అభివృద్ధికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. హుస్సేన్‌సాగర్‌ బుద్ధవిగ్రహాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేసింది. వీటితో పాటు హైదరాబాద్ - నాగార్జునసాగర్‌ మధ్య 4 వరుసల రోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు చేసింది. | Read More

ETV Bharat Live Updates - TG GOVT FOCUS ON TOURISM DEVELOP

05:06 PM, 31 Aug 2024 (IST)

కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం! - అధ్యక్ష పీఠం ఆ ఇద్దరిలో ఎవరికి దక్కేనో! - Delay in selection of new PCC Chief

New PCC Leader In Telangana Congress : కాంగ్రెస్‌ నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ, ఎంపిక బాధ్యతను రాహుల్‌ గాంధీకి అప్పగించినట్లు తెలుస్తోంది. బీసీలకే పీసీసీ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న గట్టి పోటీతో ఎటు మొగ్గు చూపాలో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. | Read More

ETV Bharat Live Updates - TELANGANA PCC NEW CHIEF 2024

05:01 PM, 31 Aug 2024 (IST)

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బీ అలర్ట్‌ - ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని కలవండి - Brain Stroke Symptoms

Brain Stroke Symptoms : ఉన్నట్టుండి కంటిచూపు కోల్పోతున్నారా? అదుపు తప్పి పడిపోతున్నారా? అనూహ్యంగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందా? ఐతే, తస్మాత్ జాగ్రత్త! అది స్ట్రోక్ లక్షణం కావొచ్చు. శరీరంలోని ఓ చేయి బలహీనం అవ్వడం, అడుగు తీసి అడుగు వేసేందుకు కాళ్లు సహకరించకపోవటం లాంటివి స్ట్రోక్‌ లక్షణాలే. అలా అని అదేదో గుండెపోటు కాదు. దాని పేరు బ్రెయిన్ స్ట్రోక్! దీని బారిన ఒక్కసారి పడితే శాశ్వత వైకల్యానికే ఆస్కారం ఎక్కువ. బ్రెయిన్‌ స్ట్రోక్ రావడాన్ని ఎలా గుర్తిచాలి? వైద్యుల సూచనలేంటి? లాంటి అంశాలపై ప్రత్యేక కథనం | Read More

ETV Bharat Live Updates - HOW TO RECOGNIZE A BRAIN STROKE

04:30 PM, 31 Aug 2024 (IST)

ఉమ్మడి గుంటూరు జిల్లాను వణికిస్తున్న వరుణుడు - రోడ్లు జలమయం - Heavy rain in joint Guntur district

Heavy Rains in AP: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా వణుకుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరులోని కలెక్టర్​ కార్యాలయ రహదారి, మూడు వంతెనల మార్గం, చుట్టుగుంట మహాత్మాగాంధీ ఇన్నర్​ రింగ్​రోడ్డు, శివారెడ్డి పాలెం పరిసరాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరింది. దీంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. | Read More

ETV Bharat Live Updates - GUNTUR FLOODS

04:01 PM, 31 Aug 2024 (IST)

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వానలే వానలు - పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ - Heavy Rain Alert To Telangana

IMD Issues Red Alert To few Districts of Telangana : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న ప్రకటించారు. శని, ఆదివారాలు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAIN ALERT TO TELANGANA

03:55 PM, 31 Aug 2024 (IST)

లోన్ యాప్​ల ఉచ్చులో పడకండి - జీవితాన్ని ఆగం చేసుకోకండి - Loan App Harassments in telangana

Loan App Harassments in Telangana : లోన్​యాప్​ల నిర్వాహకుల ఆగడాలకు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. తక్షణ రుణాల పేరుతో సెల్​ఫోన్​లకు మెసేజ్​లు పంపిస్తూ తీసుకున్నాక అధిక వడ్డీలు వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నారు. లోన్​యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు ఈ లోన్ యాప్​లతో ఏవిధంగా మోసాలకు పాల్పడుతున్నారు? వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates - ONLINE LOAN SCAMS

02:59 PM, 31 Aug 2024 (IST)

తెలంగాణకు భారీ వర్ష సూచన - రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు - telangana weather report

Telangana Weather Report Today : రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెయిన్​ అలర్ట్​ను జారీ చేసింది. ప్రజలు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN TELANGANA

02:30 PM, 31 Aug 2024 (IST)

రామగుండంలో 800 మెగా వాట్ల విద్యుత్ పవర్‌ ప్లాంట్‌ : భట్టి విక్రమార్క - Bhatti on Ramagundam Power plant

Bhatti on Power Plant : పెద్దపల్లి జిల్లా రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్తు పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించినట్లు వెల్లడించారు. ఇవాళ రామగుండం బీ పవర్‌హౌస్‌ పర్యటనలో భాగంగా మంత్రులు భట్టి, శ్రీధర్​బాబు స్థలాలను పరిశీలించారు. | Read More

ETV Bharat Live Updates - BHATTI ON POWER PLANT IN RAMAGUNDAM

02:31 PM, 31 Aug 2024 (IST)

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు - నలుగురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు - Vijayawada Landslide Deaths

Heavy Rains in AP : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అని అధికారులు పరిశీలిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - LANDSLIDE IN VIJAYAWADA

02:21 PM, 31 Aug 2024 (IST)

అక్రమ నిర్మాణాలకు అనుమతులు - హైడ్రా సిఫార్సుతో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు - HYDRA Action Against Officials

HYDRA Action Against Officials : హైదరాబాద్​ నగర పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్‌ ఆర్థిక నేర యూనిట్​లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates - HYDRA WARNING OFFICERS

01:18 PM, 31 Aug 2024 (IST)

కూర్చోలేడు, నడవలేడు - వెన్నుపూస దెబ్బతిని జీవచ్ఛవంలా యువకుడు - దాతల సాయం కోసం ఎదురుచూపులు - Young Man Seeking Help

Young Man Seeking Help : అతనిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ పూట గడవని పరిస్థితి. కుటుంబ పోషణకు కూలీ పనికి వెళ్లగా విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి నడవలేని స్థితికి చేరాడు. లక్షలు ఖర్చు పెట్టి వెన్నముక శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేదు. ఇటువంటి దీనస్థితిలో సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సోమ్లతండాకు చెందిన రమేశ్​ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. | Read More

ETV Bharat Live Updates - MAN WAITING FOR HELPING HANDS

01:02 PM, 31 Aug 2024 (IST)

గగన్‌పహాడ్‌లోకి హైడ్రా బుల్డోజర్లు - అప్ప చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు - Hydra Demolitions in Gaganpahad

Illegal Constructions in Gaganpahad : హైదరాబాద్​లో హైడ్రా హవా కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ జోరుమీదుంది. ఓవైపు వర్షం హోరుగా కురుస్తున్నా లెక్కచేయకుండా, అంతకంటే జోరుగా అక్రమ నిర్మాణాలను కూల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే గగన్‌పహాడ్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. | Read More

ETV Bharat Live Updates - ILLEGAL CONSTRUCTIONS IN GAGANPAHAD

12:56 PM, 31 Aug 2024 (IST)

పుట్టిన రోజే కానరాని లోకాలకు - కుమారుడి కళ్ల ముందే ఆత్మహత్య చేసుకున్న తల్లి - Mother Suicide front of child

Mother Commits Suicide on Birthday : పుట్టిన రోజే కుమారుడి ముందు ఉరేసుకుంది ఆ తల్లి. ఈ విషయం తెలియని ఆ రెండేళ్ల చిన్నారి, తల్లి చీరను పట్టుకుని గుక్కపట్టి ఏడ్చిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. | Read More

ETV Bharat Live Updates - MOTHER SUICIDE FRONT OF CHILD

12:27 PM, 31 Aug 2024 (IST)

భారీ వర్షాలకు విజయవాడలో విరిగిపడిన కొండచరియలు - చెరువులను తలపిస్తున్న రహదారులు - Landslide in AP

Heavy Rains in AP: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందగా, పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అని అధికారులు పరిశీలిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN AP

11:44 AM, 31 Aug 2024 (IST)

బిడ్డ బారసాల నాడే అమ్మ ఆయువు తీరే - వేడుక ముగిసిన గంటలోనే తీరని విషాదం - Mother Died After Child Barasala

Mother Died After Child Barasala : ఓ తల్లీబిడ్డల పేగు బంధాన్ని, ప్రేమానుబంధాలను చూసి విధి ఓర్వలేకపోయింది. ఆ ఆనందాన్ని, మధుర క్షణాలను వెంటనే చెరిపేయాలని తలచిందో ఏమో ఆ కుటుంబానికి తీరని వ్యథను మిగిల్చింది. కుమార్తె బారసాల ముగిసిన గంటల వ్యవధిలోనే గుండెపోటుతో తల్లి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. | Read More

ETV Bharat Live Updates - TRAGIC INCIDENT IN HYDERABAD

10:59 AM, 31 Aug 2024 (IST)

తెలంగాణలో భారీ వర్షాలు - చెరువులుగా మారిన రహదారులు - ఇళ్లల్లోకి చేరిన వరద నీరు - Heavy Rains IN Telangana

Heavy Rains IN Telangana : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - RAINS IN HYDERABAD

10:12 AM, 31 Aug 2024 (IST)

నగర శివారు ప్రాంతాలే మత్తు స్థావరాలు - పాత పరిశ్రమలే తయారీ కేంద్రాలు! - Drug Racket Arrest In Hyderabad

Drug Racket Arrest In Hyderabad : హైదరాబాద్​ నగర శివార్లు మాదక ద్రవ్యాల స్థావరాలకు అడ్డాగా మారాయి. పరిశ్రమలు, గోదాములను అద్దెకు తీసుకొని డ్రగ్స్‌ తయారీ కేంద్రాలుగా మార్చుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని దేశ, విదేశాలకు మాదక ద్రవ్యాల ముడి సరుకును చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. | Read More

ETV Bharat Live Updates - DRUG RACKET IN HYDERABAD

09:55 AM, 31 Aug 2024 (IST)

అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న వర్షాలు - పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు - Heavy Rains in AndhraPradesh

Heavy Rains in Andhrapradesh : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలకు అలర్ట్‌ మెసేజ్‌లు పంపాలన్నారు. | Read More

ETV Bharat Live Updates - IMD ALERT IN AP

09:39 AM, 31 Aug 2024 (IST)

'ముందు ముంబయిలో రెక్కీ చేసి, ఆ తర్వాత కేసు - ఆ ముగ్గురే కీలకంగా వ్యవహరించారు' - Mumbai Actress Case Statement

Mumbai Actress Jethwani Case : వైఎస్సార్సీపీ హయాంలో పోలీసు అధికారుల వేధింపుల వ్యవహారంపై ముంబయి నటి విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కీలక వివరాలు వెల్లడించారు. తనపై కేసు నమోదుకు ముందే ముంబయిలో రెక్కీ నిర్వహించారన్న ఆమె, ఆ తర్వాతే విద్యాసాగర్‌తో ఫిర్యాదు ఇప్పించి తనపై కేసు పెట్టారని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్ని కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నట్లు సమాచారం. తాను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ముంబయిలో కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేశారని, బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. | Read More

ETV Bharat Live Updates - MUMBAI ACTRESS COMPLAINT TO POLICE

09:31 AM, 31 Aug 2024 (IST)

'ఇంతటి కీలకమైన విషయంలో ఇంత నిర్లక్ష్యమా - కౌంటర్ దాఖలు చేసే వరకు రోజుకు రూ.1000 కట్టండి' - High Court Judgment on IAMC

Telangana High Court On IAMC : ఐఏఎంసీకి భూ కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రభుత్వ కౌంటర్​ దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, కౌంటరు దాఖలు చేసే వరకు రోజుకు రూ.1000 చొప్పున చెల్లించాలని సర్కారును ఆదేశించింది. | Read More

ETV Bharat Live Updates - HIGH COURT ON IAMC

09:11 AM, 31 Aug 2024 (IST)

రెక్కలు ముక్కలు చేసుకుని పెంచితే - రిటైర్​మెంట్​ డబ్బుల కోసం చంపేశారు - Life imprisonment for children

judgment On Father Murder Case : రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడలో రిటైర్‌మెంట్‌ డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన ఇద్దరు కుమార్తెలు, కుమారుడికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదుతో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. | Read More

ETV Bharat Live Updates - FATHER MURDER CASE

08:52 AM, 31 Aug 2024 (IST)

కొద్దిరోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాదు - ఆక్రమణలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తాం : రంగనాథ్ - Ranganath about Hydra Operations

Commissioner Ranganath about Hydra : కొద్ది రోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాకుండా, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతుల ముసుగు తొడుగుతున్నారని తెలిపిన రంగనాథ్, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఎఫ్​టీఎల్​లోని ప్రతి అపార్ట్‌మెంట్ కూల్చాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో రంగనాథ్‌ తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - AV RANGANATH ON HYDRA

07:50 AM, 31 Aug 2024 (IST)

మొక్క మొలిచింది మొదలు - పూతపూసి కాయ కాసే కడవరకు - పంటంతా ఎరువులమయం! - Chemical Fertilizers in Crops

Chemical Fertilizers in Agriculture : పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తీరు ఏటా భారీగా పెరుగుతోంది. మొక్క మొలిచింది మొదలు, పూత పూసి కాయ కాసే కడవరకూ అంతా ఎరువులమయమవుతోంది! రైతులు ప్రతి సీజన్​లో విత్తనాల కంటే ముందుగా ఎరువులే కొనుగోలు చేసి నిల్వ చేయటం చూస్తుంటే ఎంతలా వినియోగం ఉందో చెప్పకనే చెప్పవచ్చు. అటు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా, కర్షకులు మాత్రం వాటి వాడకానికే మొగ్గు చూపుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - FERTILIZERS IN CROP CULTIVATION

07:42 AM, 31 Aug 2024 (IST)

రామగుండంలో మరో 1300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం - నేడు స్థలాల పరిశీలన - Ministers Visit for Power Plant

Site Inspection for Thermal Power Plant : మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రామగుండంలో మరో 1300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. ప్రాజెక్టుల స్థలాలను ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పరిశీలించనున్నారు. జెన్‌కో థర్మల్‌-బి పవర్‌ స్టేషన్ స్థానంలో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ క్రిటికల్‌ ప్లాంటును స్థాపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ క్రమంలో మంత్రులు స్థల పరిశీలన చేయనున్నారు. | Read More

ETV Bharat Live Updates - MINISTERS RAMAGUNDAM TOUR

07:20 AM, 31 Aug 2024 (IST)

అనురాగ్ యూనివర్సిటీ వ్యవహారంలో చట్ట ప్రకారమే ముందుకెళ్లండి : హైడ్రా అధికారులకు హైకోర్టు ఆదేశం - High Court On Anurag Colleges

High Court On Anurag Colleges : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి‌కి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనకు చెందిన అనురాగ్ యూనివర్సిటీని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా నాదం చెరువు సమీపంలో నిర్మించారని, దీనిని కూల్చి వేసేందుకు హైడ్రా సిద్ధమవుతోందంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates - ANURAG UNIVERSITY DEMOLITION ISSUE

06:31 AM, 31 Aug 2024 (IST)

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయండి : సీఎం రేవంత్ కీలక ఆదేశాలు - Yadagirigutta Temple Board

CM Revanth Reddy Review on Yadadri Temple : 'స్పీడ్' ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై అధికారులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి, టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. | Read More

ETV Bharat Live Updates - యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు
Last Updated : Aug 31, 2024, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details