తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 2 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Mon Sep 02 2024 లేటెస్ట్‌ వార్తలు- హైదరాబాద్ - విజయవాడ హైవేపై యథావిధిగా వాహనాల రాకపోకలు - Allowing Vehicles on Hyd VJA Road

By Telangana Live News Desk

Published : Sep 2, 2024, 7:20 AM IST

Updated : Sep 2, 2024, 8:54 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

08:53 PM, 02 Sep 2024 (IST)

హైదరాబాద్ - విజయవాడ హైవేపై యథావిధిగా వాహనాల రాకపోకలు - Allowing Vehicles on Hyd VJA Road

హైదరాబాద్-విజయవాడ హైవేపై యథావిధిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సుమారు 30 గంటల తర్వాత ఎన్‌హెచ్-65పై వాహనాల రాకపోకలు అనుమితిచ్చారు. | Read More

ETV Bharat Live Updates - NH ROADS

05:52 PM, 02 Sep 2024 (IST)

రెడ్ అలర్ట్ : ముంచుకొస్తున్న మరో తుపాన్ - తెలంగాణ ప్రజలారా తస్మాత్​ జాగ్రత్త! - Telangana Heavy Rains Expected

Telangana Heavy Rains Expected : ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావారణ శాఖ​ మరో షాకింగ్​​ న్యూస్​ చెప్పింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్​ పరిధికి సంబంధించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates - TELANGANA RAINS

05:27 PM, 02 Sep 2024 (IST)

చిమ్మచీకటిలో సాహసం, రాళ్లవాగులో చిక్కుకుపోయిన నలుగురిని కాపాడిన ఎన్డీఆర్​ఎఫ్ - man missed in Vagu

Man Missed in Ralla Vagu : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రాళ్లవాగు వరద ఉద్ధృతిలో డీసీఏం వ్యాన్ కొట్టుకు పోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోగా ఎన్డీఆర్​ఎఫ్​ టీమ్ 5 గంటల పాటు శ్రమించి అందులో నలుగురిని రక్షించింది. ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు. | Read More

ETV Bharat Live Updates - DCM WASHED AWAY IN RALLA VAGU

05:23 PM, 02 Sep 2024 (IST)

పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి - CM REVANTH AT KHAMMAM FLOODED AREAS

CM Revanth At Khammam Flooded Areas : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. అంతకుముందు పాలేరు రిజర్వాయర్‌, నాగార్జునసాగర్ ఎడమకాల్వను పరిశీలించారు. | Read More

ETV Bharat Live Updates - CM REVANTH AT KHAMMAM FLOODED AREAS

04:54 PM, 02 Sep 2024 (IST)

'అక్కడ కాలనీకో కథ - కుటుంబానిదో వ్యథ' - కష్టాల కడలిలో మున్నేరు బాధితులు - MUNNERU FLOOD VICTIMS PROBLEMS

Munneru Flood Victims Story : ఊహకందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు జల ఖడ్గం ఖమ్మం ముంపు ప్రాంతాల వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. నిద్ర లేచే సరికి ఉరుముకుంటూ తరుముకొచ్చిన వరద విలయం బాధితులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటెత్తిన మున్నేరు ముంపు ప్రాంత వాసుల్ని కకావికలం చేసింది. తరుముతున్న మున్నేరును చూసి గజగజ వణికిన బాధితులు ప్రాణాలు కాపాడుకునేందుకు బతుకు జీవుడా అంటూ మిద్దెపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నవారు మున్నేరు శాంతించడంతో ఇళ్లకు చేరుకున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన గూడు, రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. | Read More

ETV Bharat Live Updates - MUNNERU FLOOD VICTIMS PROBLEMS

04:18 PM, 02 Sep 2024 (IST)

'రూ.5 లక్షలు కాదు రూ. 25 లక్షలు ఇవ్వాలి' - వరద బాధితుల నష్టపరిహారంపై కేటీఆర్​ ట్వీట్​ - KTR Tweet Latest

KTR and Harish Rao on Compensation : రాష్ట్రంలో భారీ వర్షాలకు, వరదల వల్ల జరిగిన నష్టంపై మాజీమంత్రులు కేటీఆర్​, హరీశ్​రావులు ఎక్స్​ వేదికగా స్పందించారు. ఈ మేరకు వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారం కాకుండా రూ. 25 లక్షలు ఇవ్వాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవటం వల్లే ప్రాణ నష్టం జరిగిందని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. | Read More

ETV Bharat Live Updates - KTR ON RAIN VICTIMS

04:15 PM, 02 Sep 2024 (IST)

'విజయవాడ-హైదరాబాద్' హైవే రాకపోకలు షురూ - AP Vehicles Allowed to Telangana

Hyd to Vijayawada Highway Opened : విజయవాడ-హైదరాబాద్ హైవే రాకపోకలకు మార్గం సుగమమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. గరికపాడు వద్ద జాతీయ రహదారి కోతకు గురికావడంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై రాకపోకలు నిలిచిన సంగతి తెలిసిందే. | Read More

ETV Bharat Live Updates - HYDERABAD VIJAYAWADA HIGHWAY

04:16 PM, 02 Sep 2024 (IST)

తెరుచుకున్న ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు - ప్రాజెక్టుపై వాహనాల రాకపోకలకు బ్రేక్ - PRAKASHAM BARRAGE GATES OPENED

Prakasam Barrage Flood Update Today 2024 : ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది. ఎన్నడూ లేనతంగా రికార్డు స్థాయిలో ప్రవాహం పెరగడంతో అధికారులు మొత్తం 70 గేట్లను ఎత్తారు. 11.38 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - PRAKASHAM BARRAGE GATES LIFTED

03:44 PM, 02 Sep 2024 (IST)

భారీవర్షాలతో 8 జిల్లాలపై తీవ్ర ప్రభావం - నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం : శ్రీధర్‌ బాబు - Minister Sridhar Babu On Rains

Minister Sridhar Babu On Heavy Rains : ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం చేయకుండా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చర్చిస్తూ సహాయక చర్యలను నిర్దేశించినట్లు వెల్లడించారు. మృతులకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్న మంత్రి శ్రీధర్‌ బాబు, రాష్ట్రానికి సాయం చేయాలంటూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. సంక్షోభ సమయాల్లో బాధ్యతగా వచ్చి సాయం చేయాలే తప్ప రాజకీయం చేయడం తగదని మంత్రి శ్రీధర్‌ బాబు హితవు పలికారు. | Read More

ETV Bharat Live Updates - SRIDHAR BABU FIRES ON BRS LEADERS

03:35 PM, 02 Sep 2024 (IST)

ఖమ్మం జిల్లాకు బయల్దేరిన సీఎం రేవంత్ - సూర్యాపేటలో ఆగి వరదలపై సమీక్ష - CM REVANTH KHAMMAM VISIT UPDATES

CM Revanth Khammam Tour Today : వరద ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఖమ్మం జిల్లాకు వెళ్లనున్న ఆయన మార్గ మధ్యలో ముంపు ప్రాంతాల్లో ఆగి అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లా రాఘవాపూరంలో అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates - CM REVANTH ON TELANGANA FLOODS

03:21 PM, 02 Sep 2024 (IST)

ముంపు బాధితులారా బీ అలర్ట్ - సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి! - SEASONAL DISEASES PRECAUTIONS

Health Tips For Flood Effected People : తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. కనుచూపు మేర ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. చాలా చోట్ల ఇళ్లలోకి, పలుచోట్ల ఇంటి చుట్టూ వరద చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. చుట్టంతా మురుగు నీరుతో దోమలు వ్యాప్తి చెందుతుంటే జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులు బెంబెలెత్తిస్తుంటే ఇప్పుడు రెండ్రోజులుగా కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో మరిన్ని అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఈ వానలకు తోడు చల్లబడ్డ వాతావరణానికి రోగాలు వ్యాప్తి చెందే ఆస్కారం ఉండటంతో ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చుద్దామా? | Read More

ETV Bharat Live Updates - SEASONAL DISEASES PRECAUTIONS

03:22 PM, 02 Sep 2024 (IST)

భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జిలు - నిలిచిన రాకపోకలు - Bridge washed away by rains in tg

Bridges Washed Away in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపు లేకుండా రెండు రోజులుగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు కొన్ని జిల్లాల్లో ఏకంగా బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దీంతో ఆ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. | Read More

ETV Bharat Live Updates - BRIDGES WASHED AWAY IN TELANGANA

02:58 PM, 02 Sep 2024 (IST)

'అప్పులు తీర్చలేదని తండ్రి - కుటుంబ కలహాలతో తల్లి - పిల్లల్ని కడతేర్చిన కన్నవాళ్లు' - PARENTS SUICIDE AFTER KILLING KIDS

Parents Killed Kids And Committed Suicide : కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, భూ వివాదాలు, వివాహేతర సంబంధాలు కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో చాలా మంది పిల్లలను చంపేసి వారూ చనిపోతున్నారు. ఏకంగా కుటుంబాన్నే నామరూపాల్లేకుండా చేసేస్తున్నారు. కన్నబిడ్డలని కూడా చూడకుండా, వాళ్లకూ బంగారు భవిష్యత్ ఉందనే ఆలోచన లేకుండా అప్పులు తీర్చలేక పోతున్నామంటూ కొందరు, కుటుంబంలో కలహాలతో మరికొందరు చిన్నారుల భవిష్యత్‌కు పదేళ్లు నిండకుండా ఆయువు తీసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలు రెండు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. | Read More

ETV Bharat Live Updates - PARENTS SUICIDE AFTER KILLING KIDS

02:03 PM, 02 Sep 2024 (IST)

ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాల' హిడెన్‌ కెమెరాల' గుట్టు - "ప్రేమకథా" చిత్రమే కారణమా? - Gudlavalleru college Enquiry Report

Girls hostel Hidden cameras Row : ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో తలెత్తిన వివాదం విచారణ వేగంగా సాగుతోంది. కళాశాల వసతి గృహంలో హిడెన్‌ కెమెరాల ఆచూకీ కోసం పోలీసులు, సాంకేతిక బృందం అనువు అనువు గాలిస్తోంది. ఇదే తరుణంలో సమస్యను జఠిలంగా మార్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఈనెల మూడున ప్రభుత్వానికి విచారణ బృందం నివేదిక ఇవ్వనుంది. | Read More

ETV Bharat Live Updates - GIRLS HOSTEL HIDDEN CAMERAS ROW

01:21 PM, 02 Sep 2024 (IST)

ప్రణాళిక ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతోనే ఈ జల ప్రళయం : మంత్రి సీతక్క - Minister Seethakka Review on Rains

Minister Seethakka Review on Rains : రాష్ట్రంలో వర్షాలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె,​ వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. | Read More

ETV Bharat Live Updates - SEETHAKKA VISIT MAHABUBABAD

12:26 PM, 02 Sep 2024 (IST)

వరదల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం : సీఎం రేవంత్ రెడ్డి - EX GRATIA FOR TG FLOOD VICTIMS

Rs.5 Lakhs Ex Gratia To Flood Victims : తెలంగాణలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరోవైపు తీవ్ర వరద ముంపునకు గురైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు తక్షణ సాయం కింద రూ.5 కోట్లు మంజూరు చేశారు. | Read More

ETV Bharat Live Updates - 5 LAKHS EX GRATIA TO FLOOD VICTIMS

11:54 AM, 02 Sep 2024 (IST)

'ఓఆర్ఆర్​ మీద వెళ్లే వాహ‌న‌దారులకు సాయం చేసేందుకు పెట్రోలింగ్ బృందాల‌ను మ‌రింత‌గా పెంచండి' - IAS Sarfaraz Ahmed visit ORR

IAS Sarfaraz Ahmed visit ORR : ఓఆర్ఆర్ మీద వెళ్లే వాహ‌న‌దారులకు సాయం చేసేందుకు పెట్రోలింగ్ బృందాల‌ను మ‌రింత‌గా పెంచాల‌ని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పర్యటించిన ఆయన, ఓఆర్‌ఆర్‌ వెంట డ్రెయిన్ల ప‌రిస్థితిని క్షుణ్నంగా ప‌రిశీలించారు. పూడిక‌తీత ప‌నుల‌పై ఆరా తీశారు. | Read More

ETV Bharat Live Updates - HYDERABAD RAINS 2024

11:37 AM, 02 Sep 2024 (IST)

ప్రయాణికులకు ముఖ్య గమనిక - వర్షాల కారణంగా 86 రైళ్లు, 650కి పైగా ఆర్టీసీ బస్సులు రద్దు - 86 Trains Cancelled

Secunderabad to vijayawada Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు పలు రైళ్లు, ఆర్టీసీ బస్సులను అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలో 86 రైళ్లలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేయగా, 650కి పైగా ఆర్టీసీ బస్సులను టీజీఎస్​ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించగలరని మనవి. | Read More

ETV Bharat Live Updates - MAHABUBABAD RAILWAY TRACK REPAIRS

10:48 AM, 02 Sep 2024 (IST)

నూతన రింగ్​బండ్​కు భారీ గండి - మళ్లీ మొదటికి పెద్ద వాగు కథ - Hole for ring bund at Peddavagu

Pedda Vagu Flood Problem : అశ్వారావుపేటలోని పెద్దవాగు కథ మళ్లీ మొదటికి వచ్చింది. జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రింగ్​బండ్​కు 30 మీటర్ల భారీ గండి పడింది. శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఈ గండి ఏర్పడింది. | Read More

ETV Bharat Live Updates - PEDDA VAGU FLOOD PROBLEM

10:42 AM, 02 Sep 2024 (IST)

'నేనున్నానని.. మీకేం కాదని' - వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన - ap cm Visit Vijayawada flood areas

Chandrababu Visit Vijayawada : ఏపీలోని విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బోటులో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. సింగ్‌నగర్, కృష్ణలంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ అధైర్య పడొద్దని వారికి హామీ ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates - విజయవాడలో చంద్రబాబు పర్యటన

09:36 AM, 02 Sep 2024 (IST)

'మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు' - మున్నేరు వంతెనపై వరద బాధితుల ఆందోళన - Flood victims at Munneru bridge

Munneru flood that Inundated Khammam District : ఖమ్మం జిల్లాలోని పలు కాలనీల్లో మున్నేరు వాగు కన్నీటి గాథను మిగిల్చింది. తమను పట్టించుకునే వారే లేరని మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. | Read More

ETV Bharat Live Updates - MUNNERU VICTIMS

09:15 AM, 02 Sep 2024 (IST)

కృష్ణా నదిలో గంటగంటకూ పెరుగుతున్న వరద - బిక్కుబిక్కుమంటున్న 'దివిసీమ' - flood flow of Krishna river

Diviseema Flood Problems : గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ఏపీలోని దివిసీమ ప్రజలు వణికిపోతున్నారు. కరకట్ట దిగువన ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే అందర్నీ అప్రమత్తం చేసిన అధికారులు ముంపు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN AP

09:03 AM, 02 Sep 2024 (IST)

శభాష్​​ పోలీసన్నా - వరద బాధితులకు అండగా నిలిచిన పోలీస్ యంత్రాంగం - Police Help Victims in Flood Areas

Police Help Victims in Flood Areas : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల్లో పోలీసులు పెద్దఎత్తున సహాయచర్యల్లో పాల్గొంటున్నారు. రైళ్లు, వరదల్లో చిక్కుకున్న ప్రయాణికులతో పాటు పలువురిని కాపాడారు. ప్రయాణికులకు ఆహారం, తాగు నీటి సౌకర్యం కల్పించారు. సహాయ చర్యల్లో పాల్గొని బాధితులను ఆదుకున్న వారిని డీజీపీ జితేందర్‌ అభినందించారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN TELANGANA 2024

08:54 AM, 02 Sep 2024 (IST)

ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిలాల్లో జోరు వానలు - పలుచోట్ల స్తంభించిన రాకపోకలు - Heavy Rains In Adilabad

Heavy Rains In Telangana : భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిలాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వాగులు, వంకల ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్‌, హుస్నాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొన్నం పరిశీలించారు. జిల్లాల్లో లోలెవల్ కాజ్ వేలను గుర్తించి అక్కడ హై లెవల్ వంతెనలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN ADILABAD

08:55 AM, 02 Sep 2024 (IST)

ఉమ్మడి వరంగల్, నల్గొండ​ జిల్లాలపై వరుణుడి ప్రతాపం - అస్తవ్యస్తమైన జనజీవనం - heavy rains lash joint warangal

Rains in Warangal and Nalgonda Districts : ఉమ్మడి వరంగల్ జిల్లాను వాయుగుండం వణికించింది. భారీవర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె కేసముద్రం మధ్యలో కిలోమీటరుపైన రైల్వే ట్రాక్ దెబ్బతినగా అధికారులు మరమ్మతులు చేపట్టారు. ములుగు జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జన జీవజీవనం స్తంభించింది. కోదాడలో పలు కాలనీ నీటమునిగాయి. హుజూర్‌నగర్‌ నియోజవర్గంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN WARANGAL DISTRICT

08:37 AM, 02 Sep 2024 (IST)

జోరువానలకు ఉమ్మడి మెదక్‌, పాలమూరు జిల్లాలు అతలాకుతలం - నేడు రెడ్‌ అలర్ట్ జారీ - TELANGANA RAINS 2024

Telangana Rains 2024 : జోరువానలకు ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చెరువులు, వాగులు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వరద తాకిడికి పంట పొలాలు నీటమునిగాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా దుందుభి నదిలో కొట్టుకుపోయిన గొర్రెల కాపరులను నాటు పడవలతో రక్షించారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN MEDAK DISTRICT

07:30 AM, 02 Sep 2024 (IST)

జల విలయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కకావికలం - ఊరూఏరును ఏకం చేసిన జడివాన - Heavy Rains Floods In Khammam

Heavy Rains Floods In Khammam : జలవిలయం ఉమ్మడి ఖమ్మం జిల్లాను కకావికలం చేసింది. 15 గంటల పాటు ఏకధాటిగా కురిసిన జడివానతో ఊళ్లన్నీ ఏర్లను రహదారులు, చెరువుల్ని తలపించాయి. కాకరవాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పిడుగులా పడిన మున్నేరు మరోసారి ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కల్లోలం రేపింది. చూస్తుండగానే ముంపు కాలనీలను మున్నేరు వరద చుట్టుముట్టింది. పదుల సంఖ్యలో కాలనీలు, వందలాది ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేనంతగా పాలేరు జలాశయం మహోగ్రరూపం దాల్చింది. భక్తరామదాసు పంప్‌హౌజ్‌ నీటమునిగింది. నాగార్జునసాగర్ కాల్వకు రెండు చోట్ల భారీ గండిపడింది. భారీ వరదలు, వర్షాలకు ఉమ్మడి జిల్లాల్లో ఐదుగురు మృత్యువాతపడగా, ఇద్దరు గల్లంతయ్యారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAIN IN KHAMMAM

07:12 AM, 02 Sep 2024 (IST)

తెలంగాణలో వర్ష బీభత్సం - 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు బంద్ - నేడూ భారీ వర్షాలు - heavy rains in telangana today

Heavy Rain Alert Today : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రహదారులు ధ్వంసం కావడంతో 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 98 చెరువులకు గండి పడగా, మరో 67 దెబ్బ తిన్నట్లు వివరించింది. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఫోన్ చేసి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates - RAIN ALERT TO TELANGANA TODAY

06:53 AM, 02 Sep 2024 (IST)

హైదరాబాద్​ వాసులను అడుగు బయట పెట్టనియ్యలె - ఎడతెరిపిలేని వానలతో నగరంలో ముగ్గురి మృతి - HYDERABAD RAINS 2024

Hyderabad Rains 2024 : రెండు రోజుల పాటు తెరిపిలేని వానలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. కాలనీలు జలమయమై, రోడ్లపై వరద పొంగుతుండగా, హుస్సేన్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అనేక చోట్ల భారీ వృక్షాలు, కరెంట్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ సంస్థ - హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సహాయక చర్యలు చేపట్టారు. ఘట్​కేసర్‌లో విద్యుత్‌ షాక్‌తో ఒకరు, షాద్‌నగర్‌లో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌ అనుదీప్‌, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. | Read More

ETV Bharat Live Updates - TELANGANA RAINS 2024
Last Updated : Sep 2, 2024, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details