Telangana High Court Refused to Stop the DSC Exam : ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి, విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఈ ఏడాది ఫిభ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన అశోక్, రామకృష్ణతో పాటు మరో 8 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు.
డీఎస్సీ నిలిపివేయాలంటూ పిటిషన్ - మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో - Telangana HC Refused To Stop DSC - TELANGANA HC REFUSED TO STOP DSC
Telangana HC Refused To Stop DSC Exam : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ పరీక్షలను నిలిపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.
Published : Jul 18, 2024, 4:14 PM IST
డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, పరీక్షలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కరుణసాగర్ కోర్టుకు తెలిపారు. సిలబస్ ఎంతో క్లిష్టంగా ఉందని, అభ్యర్థులు చదువుకోవడానికి సరైన సమయం కూడా ఇవ్వలేదని విద్యా హక్కు చట్టం నిబంధనలకు ఇది విరుద్ధమని ఆయన వాదించారు. గురువారం ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతాయని, పరీక్షలు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ, విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.