తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 11:21 AM IST

ETV Bharat / state

'ఆరు వారాల్లో ఆ వ్యవసాయ భూములకు పునరావాస ప్రయోజనం కల్పించాలి' - TG HC ON Anantgiri Reservoir LANDS

Telangana High Court on Irrigation Lands : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం సేకరించిన వ్యవసాయ భూముల విషయంలో హైకోర్టు విచారణ జరిగింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు ఉన్నందున పరిహారం చెల్లించే వరకు రైతులను ఖాళీ చేయరాదని ఆదేశించింది. ఆరు వారాల్లో వ్యవసాయ భూములకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలని తీర్పునిచ్చింది.

Petitioner Explain on Ananthagiri Reservoir
Anantgiri Reservoir Land Issue (ETV Bharat)

Telangana High Court on Irrigation Lands : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్ నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అనంతగిరిలో సేకరించిన వ్యవసాయ భూములకు 6 వారాల్లో పునరావాస ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు రైతులను వ్యవసాయ భూముల నుంచి ఖాళీ చేయించరాదని ఆదేశించింది. చట్టప్రకారం పునర్నిర్మాణ, పునరావాస ప్రయోజనాలను కల్పించాలని తెలిపింది.

Anantgiri Reservoir Land Issue: అనంతగిరి రిజర్వాయర్ నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భూసేకరణను సవాలు చేస్తూ సీహెచ్ లక్ష్మారెడ్డి, మరో 20 మంది రైతులు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో అనంతగిరి రిజర్వాయర్ కోసం భూసేకరణ నిమిత్తం 2017 జనవరి 1న, మే 16 తేదీల్లో ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. నోటిపికేషన్ జారీ చేసే ముందు భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడంపై కొంత మంది అభ్యంతరాలు లేవనెత్తినా అప్పటి కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. అంతేగాకుండా విధానపరమైన లోపాలపై ప్రశ్నించినందుకు బెదిరింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. అవార్డు ప్రకటించే ముందు అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోలేదని గుర్తు చేశారు.

'భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించండి'

Petitioner Explain on Ananthagiri Reservoir Land : అధికారులు ప్రకటించిన పరిహారాని తీసుకుంటూ దాన్ని మరింత పెంచాలంటూ చేసిన అభ్యంతరాలను భూసేకరణ ఆథారిటీకి పంపాలని అధికారులను కోరినా కలెక్టర్​ పట్టించుకోలేదని న్యాయవాది తెలిపారు. ఇప్పటివరకు పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు కల్పించకుండా పిటిషనర్ల పక్క భూముల్లో పనులు మొదలు పెట్టారని వెల్లడించారు. పిటిషనర్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసుల ద్వారా బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతగిరి, రేపాక గ్రామల్లోనూ భూములకు అవార్డు ప్రకటించి పరిహారం చెల్లించారని, ఈ భూముల్లో అనంతగిరి రిజర్వాయర్ బండ్ బాగాన్ని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

HC onAnantgiri Reservoir Land : 2018 జనవరిలో గ్రామసభ నిర్వహించామని పునరావాస చట్టం కింద ప్రతిపాదనలు సిద్ధం చేయగా కమిషనర్ ఆమోదించారని, ప్రభుత్వం జీవో 1045 చేసిందని అధికారులు వివరించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గతంలో పరిహారం చెల్లించిన భూములను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫునరావాస పరిహారం చెల్లించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎలాంటి ఆధారాలను చూపలేదన్నారు.

రైతులను ఖాళీ చేయంచరాదు : సేకరించిన భూములకు పునరావాసం ప్రయోజనాలు కల్పించేదాకా భూములను ఖాళీ చేయించరాదని హైకోర్టు 2018లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. వాటిని ఉల్లంఘించడంతో కోర్టు దిక్కరణ కింద కోర్టు శిక్ష విదించిందన్నారు. ఈ ఉత్తర్వులు ఇప్పటికే అమల్లో ఉన్నందున పరిహారం చెల్లించేదాకా వారిని ఖాళీ చేయించరాదని ఆదేశించారు. ఉత్తర్వులు అందిన ఆరు వారాల్లో వ్యవసాయ భూములకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించారు.

హైకోర్టు సంచలన తీర్పు- 65శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు

ABOUT THE AUTHOR

...view details