అలాంటి వారు రైతుబంధు డబ్బులు తిరిగి ఇచ్చేయండి - ప్రభుత్వం ఆదేశం - Rythu Bandhu scheme Recovery - RYTHU BANDHU SCHEME RECOVERY
Rythu Bandhu Scheme : రైతుబంధుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు వెనక్కి తీసుకోనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లాలోని ఓ రైతుకు రూ.16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు పంపింది.

Published : Jul 11, 2024, 9:00 PM IST
Rythu Bandhu scheme Recovery in Telangana : గతంలో ఇచ్చిన రైతుబంధుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం రైతు యాదగిరిరెడ్డికి నోటీసులు పంపించింది. వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధుగా తీసుకున్న రూ.16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. గతంలో 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి రైతు యాదగిరిరెడ్డి అమ్మేశారు. రైతుబంధు కింద 33 ఎకరాల ప్లాట్ల భూమిపై యాదగిరిరెడ్డికి రూ.16 లక్షల రైతుబంధును ప్రభుత్వం చెల్లించింది.