Telangana Govt Debt 2024 : తెలంగాణ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-2024 బడ్జెట్ అంచనాల మేరకు రాకపోవడంతో సర్కార్ తంటాలు పడుతోంది. తాజాగా మరో రూ.1,718 కోట్ల రుణాల సేకరణకు బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టింది. వీటితో కలిపి ఈ నెలలోనే మొత్తం బాండ్ల విక్రయాలపై తీసుకున్న అప్పులు రూ.7,718 కోట్లకు చేరనున్నాయి. ఆదాయం లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించకపోవడంతో రూణాలు తెచ్చి పెండింగ్ బిల్లులకు నగదు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Ts Govt Income Problems : ఈ నెలాఖరులోగా డబ్బు విడుదల చేయకపోతే మంజూరైన బిల్లులు మురిగిపోతాయని ఉద్యోగులు, గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరిస్థితి మొదాలుకు వస్తుందని వాపోతున్నారు. వీరందరికి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.40,000ల కోట్లకు పైగా ఉన్నందున ఇప్పటికిప్పుడు సర్దుబాటు చేయలేకపోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
సరిపోని ఆదాయం : ఈ సంవత్సరం పన్నుల కింద మొత్తం రూ.1.52 లక్షల కోట్ల ఆదాయం రాబట్టాలని రాష్ట్ర బడ్జెట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ అంచనా వేసింది. ఇప్పటివరకు రూ.1.30 లక్షల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి మరో ఆరు పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం అప్పులు, పన్నుల ద్వారా ఆదాయం రూ.2.59 లక్షల కోట్లకు పైగా ఉంటుందని బడ్జెట్ అంచానా వేశారు. ఇందులో సేకరించే రూ.38,234,94 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. ఇప్పటివరకూ సమకూరిన ఆదాయం సుమారు రూ.2.10 లక్షల కోట్లలోపే ఉంది.
రాష్ట్రం మరో రూ.1,000 కోట్ల అప్పు.. ఇప్పటి వరకు ఎంత చేసిందంటే?