Governor Quota MLC Case in High Court: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకానికి తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల తరపు న్యాయవాది సోమవారం హైకోర్టుకునివేదించారు. మంత్రిమండలి సిఫార్సు మేరకే ఎమ్మెల్సీలుగా గవర్నర్ నియమించారన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు నామినేట్ చేసింది. అయితే, ఆ ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించిన విషయం విధితమే. ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేయగా గవర్నర్ ఆమోదించించడంతో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలు అప్పట్లో హైకోర్టును సంప్రదించారు.
12 మంది ఐపీఎస్‌ల బదిలీ- రాచకొండ సీపీగా తరుణ్ జోషి
High Court Hearing On Governor Quota MLC Petition :గతంలో గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించింది. ప్రతివాదులైన కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ సోమవారం వాదనలను కొనసాగిస్తూ పిటిషనర్లు తమ అభ్యర్థనలను సవరిస్తూ జనవరి 27న ప్రభుత్వం జారీచేసిన జీవో 12, 13లను కొట్టివేయాలని కోరారన్నారు. జెంటిల్మెన్ ఒప్పందానికి విరుద్ధంగా నియామకాలు చేపట్టారని, అందువల్ల జీవోలను కొట్టివేయాలని కోరడం సరికాదన్నారు. మంత్రిమండలి సిఫార్సు మేరకే నియామకం జరిగిందన్నారు.