Telangana Stamps-Registrations Department Revenue Increased :భూములు, భవంతులు, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువలు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల నుంచి సవరించిన విలువలు అమల్లోకి తెచ్చేందుకు తెచ్చేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిర్దేశించిన సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి శాస్త్రీయబద్ధంగా విలువలు పెంచాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు విలువల సవరణపై ప్రత్యేక దృష్టిపెట్టాయి.
క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రస్తుతం అమలవుతున్న మార్కెట్ విలువలు, బహిరంగ మార్కెట్ విలువలతో కూడిన నివేదికలను సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వారీగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కార్యాలయానికి చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్దప్రకాష్ నియమితులు కావడం వల్ల ఆయనతో చర్చించాక కసరత్తు కొనసాగించాల్సి రావడంతో కొంత ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల నుంచి విలువల పెంపు అమల్లోకి రావాల్సినా మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు 50శాతం రాయితీ అంశం సర్కార్ పరిశీలనలో ఉంది : సీతక్క
అదనంగా రాబడి : మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం ముందస్తుగా షెడ్యూల్ విడుదల చేసి ఉండడం కసరత్తు శరవేగంగా సాగుతుండడంతో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఆగస్టు నుంచి ధరలు పెరగుతాయని తెలియడంతో ముందే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పలువురు ఆసక్తి చూపడంతో కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో తొలి నాలుగు నెలల్లో రూ.4,771.61 కోట్లు రాబడి రాగా 2024-25 ఆర్థిక ఏడాదిలో అదే నాలుగు నెలల్లో రూ.5,126.77 కోట్లు ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే నాలుగునెలల్లో ఏకంగా రూ.354.96 కోట్లు అదనంగా రాబడి వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతరత్ర సేవల ధరలు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వాటిని శాస్త్రీయబద్ధంగా పెంచాలన్న మంత్రి పొంగులేటి ఆదేశాలతో దేశంలోని కనీసం ఐదారు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న తీరును అధ్యయనం చేసి మెరుగైన రీతిలో ఇక్కడ అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ యోచిస్తోంది. సెప్టెంబరులో సవరించిన ధరలు అమలులోకి వచ్చే అవకాశంఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భూముల రిజిస్ట్రేషన్ రేట్లు పెంపుతున్నారని పుకార్లు - కార్యాలయాలకు జనం బారులు
భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు రంగం సిద్ధం - tg land registration charges