తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పు - కొత్త తేదీలు ఇవే - Tg EAMCET Counselling dates change - TG EAMCET COUNSELLING DATES CHANGE

Telangana EAMCET 2024 Counselling Postponed : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌/ బీఈ సీట్ల భర్తీకి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూన్‌ 27 నుంచి ప్రారంభం కావాల్సిన షెడ్యూల్​ వాయిదా పడింది. జులై 4 నుంచి తొలి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Telangana EAMCET 2024 Counselling postponed
Telangana EAMCET 2024 Counselling postponed (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 6:53 PM IST

TG EAMCET 2024 Counselling Schedule Dates Change : రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్​ షెడ్యూల్​లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కావాల్సిన షెడ్యూల్​ను వాయిదా వేసింది. మూడు విడతలుగా ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ జరగనుంది. జులై 4 నుంచి ఇంజినీరింగ్​ తొలి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ చేయనున్నారు. అలాగే జులై 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్​ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 19న ఇంజినీరింగ్​ తొలి విడత సీట్ల కేటాయింపు జరగనుంది.

జులై 26 నుంచి ఇంజినీరింగ్​ రెండో విడత కౌన్సెలింగ్​, జులై 27న రెండో విడత సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ చేయనున్నారు. జులై 27, 28 తేదీల్లో వెబ్​ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు, ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్​ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆగస్టు 9న సర్టిఫికేట్ల వెరిఫికేషన్​ జరగనుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్​ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 13న సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఆగస్టు 21 నుంచి కన్వీనర్​ కోట ఇంటర్నల్​ స్లైడింగ్​కి అవకాశం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details