CM Revanth Will Attend Vizag Meeting: విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రైవేటికరించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ గిడుగు రుద్రరాజు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిర్వహించే సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ అంశంపై నేడు జరిగే సభలో కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించనుందని తెలుస్తోంది.
హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి: నేడు తృష్ణా మైదానంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ విశాఖలో నిర్వహించనున్న సభకు రేవంత్ రెడ్డి హాజరు అవుతారని పీసీసీ వర్గాలు స్పష్టం చేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిర్వహించే సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల - 34 మందికి ఛాన్స్
విశాఖ సభలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ అంశంపైనా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని ఇప్పటికే ఆ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిల ప్రకటించడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టత నిచ్చే అంశంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది.