ETV Bharat / state

సింగరేణి వ్యాప్తంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి : బలరాం

ప్రజాపాలన విజయోత్సవాలపై సింగరేణి సీఎండీ సమీక్ష - సీఎం చేతుల మీదుగా డిసెంబర్ 4న పెద్దపల్లి సభలో 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు

Singareni CMD On Praja Palana Vijayotsavalu
Singareni CMD On Praja Palana Vijayotsavalu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 10:41 PM IST

Singareni CMD On Praja Palana Vijayotsavalu : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న "ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల"ను సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని, దీనికోసం అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సింగరేణి ఛైర్మన్, ఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన ప్రజా విజయోత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదగా 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందివ్వనున్నారని, వీటిలో సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగాలు పొందిన 593 మందికి కూడా నియామక పత్రాలు అందజేయనున్నారని తెలిపారు. ఇందుకోసం తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక కొత్త పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని బలరాం తెలిపారు. ఏడాది కాలంలో 2,165 నూతన ఉద్యోగాలను కల్పించడం జరిగిందని, చరిత్రలో అత్యధికంగా 33% లాభాల వాటా బోనస్​ను కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్కరికి రూ.1,90,000 వరకు లాభాల వాటా అందిందని పేర్కొన్నారు. అలాగే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు కూడా 5,000 రూపాయల లాభాల వాటా పంపిణీ చేశామని తెలిపారు. గత ఏడాది పాలనలో సింగరేణి సంస్థలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

దీపావళి బోనస్​గా ఒక్కొక్కరికి రూ.93,750 : అలాగే దీపావళి బోనస్ (పి‌.ఎల్.ఆర్.ఎస్) ఒక్కొక్కరికి రూ.93,750 చెల్లించడం జరిగిందన్న ఆయన, ఇది అంతకుముందు ఏడాది కన్నా రూ.50 కోట్లు అధికమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త గనులను పొందడం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాక్ కోసం స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి వెళ్లి సంబధిత అనుమతులు సాధించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థ మాత్రమే చేపట్టే విధంగా ప్రత్యేక చొరవ చూపించడం జరుగుతోందన్నారు.

ఘనంగా ప్రజాపాలన ఉత్సావాలు నిర్వహించాలి : సింగరేణివ్యాప్తంగా ఇంకా మరెన్నో కొత్త కార్యక్రమాలను కూడా త్వరలో చేపట్టనున్నామని వివరించారు. ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, శాఖల్లో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ పర్సనల్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ ఎస్ డిఎం సుభాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ రవి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు బోనస్‌ - ఒక్కొక్కరికి ఎంతంటే?

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ - ఈసారి ఎంత ఇచ్చారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.