తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలోనూ ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ - ఆదివారం రాష్ట్ర మంతివర్గం కీలక సమావేశం - తెలంగాణలోనూ ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్

Telangana Cabinet Meeting For Budget Sessions : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు సమాయాత్తమవుతోంది. ఈక్రమంలోనే బడ్జెట్ ప్రతిపాదనలు, గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​​ ప్రవేశపెట్టనుంది.

CM Review on Six Guarantees For Budget Plan
Telangana Cabinet Meeting For Budget Sessions

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 9:07 PM IST

Telangana Cabinet Meeting For Budget Sessions :రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు సమాయాత్తమవుతోంది. ప్రధానంగా బడ్జెట్​, గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అదేవిధంగారాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ సైతం ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు(Budget Meetings) నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి మాస్‌ వార్నింగ్‌

ఈనెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టి, 12 వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈనెల 4న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్​పై చర్చించనున్నారు. వివిధ శాఖలు ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాయి. ఓటాన్ అకౌంట్ అకౌంట్​కు, గవర్నర్(Governor Tamilisai) ప్రసంగానికి ఆమోదం తెలపడంతో పాటు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు కొత్త పథకాలపై మంత్రివర్గం చర్చించనుంది.

CM Review on Six Guarantees For Budget Plan :రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది, ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్‌లోనే వాటికి నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి ఆర్థికశాఖకు సూచించారు. శాసనసభ సమావేశాల్లోపు మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో(Cabinet Subcommittee) సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆ రెండు పథకాలతో పాటు,గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చునని భావిస్తున్నారు.

State Treasury Mobilized Through Loans : రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 2000 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేసింది. వెయ్యి కోట్ల విలువైన బాండ్లను 11 ఏళ్ల కాలానికి, మరో వెయ్యి కోట్ల విలువైన బాండ్లను 21 ఏళ్ల కాలానికి విడుదల చేశారు. బాండ్లను ఆర్​బీఐ(RBI) వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4400 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకొంది. తాజాగా అప్పుతో ఆ మొత్తం రూ.6400 కోట్లకు చేరనుంది. మా ప్రభుత్వాన్ని పడగొట్టేది ఎవరు?: సీఎం రేవంత్‌రెడ్డి

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details