Telangana Bjp Vijaya Sankalpa Yatra : రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలతో కమలదళం ముందుకెళ్తోంది. అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. దేశాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రధాన మంత్రి అవుతారని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ పథకం, పేదలకు ఇంటి నిర్మాణంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయాన్ని వివరించారు. 370 అర్టికల్ రద్దు, రామజన్మ భూమిలో రామాలయ నిర్మాణం చేశామన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ఆభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దారని అన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు : కిషన్ రెడ్డి
Etela Rajender Fires On Congress Party: అధికారంలోకి రాగానే బెల్టు షాపులు రద్దు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు తొలగించట్లేదని బీజేపీసీనియర్‌నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మెదక్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా బోధన్ చౌరస్తా నుంచి మెదక్ రాందాస్ చౌరస్తా వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ ధర మొత్తాన్ని ముందే లబ్ధిదారులే చెల్లించాలని చెప్పడం సబబుకాదంటూ ఈటల పేర్కొన్నారు. ఓట్లప్పుడేమో అందరికీ గ్యాస్ ఉచితమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త కొర్రీలు పెడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు.