తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభ ఈనెల 16వ తేదీకి వాయిదా - TELANGANA ASSEMBLY LIVE UPDATES

TELANGANA ASSEMBLY LIVE UPDATES
assembly live News (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 10:58 AM IST

Updated : Dec 9, 2024, 2:07 PM IST

Telangana Assembly Live Updates :ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ ఉభయ సభల ముందు 5 బిల్లులు, 2 నివేదికలను పెట్టనున్నారు.

LIVE FEED

2:00 PM, 9 Dec 2024 (IST)

వచ్చే సోమవారానికి శాసనసభ వాయిదా

శాసనసభ ఈనెల 16వ తేదీకి వాయిదా

శాసనసభ ఈనెల 16కు వాయిదా వేసిన స్పీకర్‌

12:46 PM, 9 Dec 2024 (IST)

ప్రోటోకాల్ అంశంపై రేపు సభలో చర్చ జరగాలి : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

  • కాటిపల్లి
  • తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేయట్లేదు: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
  • ప్రొటోకాల్‌ పాటించట్లేదు: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
  • ప్రోటోకాల్ పాటించట్లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు: వెంకటరమణారెడ్డి
  • ఎమ్మెల్యే కి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలని కోరుతున్నాం
  • ప్రోటోకాల్ అంశంపై రేపు సభలో చర్చ జరగాలి

12:34 PM, 9 Dec 2024 (IST)

కాంగ్రెస్‌ అంటేనే మహిళలను గౌరవించే ప్రభుత్వం : సీతక్క

సీతక్క

  • తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపైనా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి
  • తెలంగాణ బిడ్డల అస్థిత్వాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం
  • పదేళ్లలో రాష్ట్రగీతం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదు
  • జయ జయహే తెలంగాణ గీతాన్ని వింటుంటే మనస్సు పులకరిస్తుంది
  • తెలంగాణ బిడ్డలు మట్టిబిడ్డలు.. గట్టిబిడ్డలు: మంత్రి సీతక్క
  • కాంగ్రెస్‌ అంటేనే మహిళలను గౌరవించే ప్రభుత్వం: సీతక్క
  • ఉచిత బస్సు ప్రయాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టాం
  • నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం

12:21 PM, 9 Dec 2024 (IST)

అసెంబ్లీలో బీజేపీ నేతల నిరసన

  • ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై అసెంబ్లీలో బీజేపీ నేతల నిరసన
  • శాసనసభలో బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం
  • సభ తర్వాత బీజేపీ సభ్యులు, మంత్రిని పిలిచి మాట్లాడుతామన్న స్పీకర్
  • సభను అమర్యాదపరిచేలా మాట్లాడవద్దని వారించిన స్పీకర్‌
  • సీఎం ప్రకటనపైనే ఇవాళ్టి సభ నడుస్తుందన్న స్పీకర్‌
  • ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై అధికార పక్షం సూచనలు ఇచ్చిందన్న స్పీకర్‌
  • న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామన్న స్పీకర్‌

12:04 PM, 9 Dec 2024 (IST)

ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబిస్తామని అభయం ఇస్తున్నాం : శ్రీధర్‌బాబు

శ్రీధర్‌బాబు

  • తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రత్యేక ప్రస్తావన జరుగుతోంది
  • ప్రతిపక్ష నేతల విషయంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తున్నారు
  • ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై అధికారులకు ఆదేశాలు ఇస్తాం

11:43 AM, 9 Dec 2024 (IST)

గత పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమీ రాలేదు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి LIVE

తెలంగాణ ప్రకటన రోజు.. నాలుగు కోట్ల ప్రజల కోరిక తీరిన రోజు

సోనియాగాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు

ఈ విషయాన్ని సభలో ప్రతిపక్ష నేత స్వయంగా ప్రకటించారు

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి

గత పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమీ రాలేదు

మేధావులతో చర్చించాక తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేశారు

గ్రామీణ పరిస్థితులు ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన

తెలంగాణ ఇచ్చిన సోనియాకు కనీసం శుభాకాంక్షలు తెలపని కుసంస్కారం

11:27 AM, 9 Dec 2024 (IST)

మీరు మాత్రం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకున్నారు : కూనంనేని సాంబశివరావు

కూనమనేని సాంబశివరావు

  • తెలంగాణ హామీని సోనియాగాంధీ నిలబెట్టుకున్నారు
  • తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బీఆర్‌ఎస్‌ ఉంటే బాగుండేది
  • ప్రతిపక్ష పార్టీల భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవు
  • మీరు కోరుకున్న పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలనుకోవద్దు
  • ఇప్పుడున్నది మీ ప్రభుత్వం కాదని గుర్తించాలి
  • ప్రస్తుత ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి
  • గతంలో తెలంగాణ తల్లి విగ్రహ తయారీలో ప్రతిపక్ష నేతలను పిలిచారా
  • గతంలో తెలంగాణ తల్లి విగ్రహ తయారీలో మమ్మల్ని మాత్రం పిలవలేదు
  • గతంలో అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా చేశారు
  • సోనియా భిన్నాభిప్రాయంతో ఉండి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు
  • మలిదశ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు
  • తెలంగాణ యువకులపై వందల కేసులు ఉన్నాయి
  • త్యాగాలు అన్నీ ఒక్కరివే అనే భావనలో ఉండకూడదు
  • తెలంగాణ సాధనలో అన్ని పార్టీలు, అందరి కృషి ఉంది
  • మీరు మాత్రం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకున్నారు
  • మీరేమో కావాల్సిన విధంగా మార్పులు చేసుకుంటారు
  • తెలంగాణ అభయహస్తం కాదు.. ఆశీస్సులుగా భావిస్తున్నాం

11:16 AM, 9 Dec 2024 (IST)

తెలంగాణ చిహ్నంలో మార్పు జరగలేదు: పొన్నం

  • తెలంగాణ రావడానికి కావరణం సోనియాగాంధీ: పొన్నం
  • తెలంగాణ చిహ్నంలో మార్పు జరగలేదు: పొన్నం
  • తెలంగాణ గీతాన్ని రూపొందించి అధికారికంగా ఉపయోగిస్తున్నాం
  • గతంలో ఉన్న విగ్రహాలు పార్టీకి సంబంధించినవి
  • తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వపరంగా లేదు
  • తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నాం
  • తెలంగాణ సెంటిమెంట్‌కు అనుగుణంగా విగ్రహ తయారీ
  • గతంలో పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగించారు
  • ఇటీవల వరదలు వస్తే కేంద్రం కేవలం రూ.400 కోట్లు ఇచ్చింది
  • కేంద్రం నుంచి నిధుల సాధనకు అందరం కృషిచేయాలి
  • ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా అందరూ పనిచేయాలి
  • తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించాం
  • అందరూ ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి
  • రాజకీయాలు.. తెలంగాణ ప్రయోజనాలు వేర్వేరు అని చాటాలి

11:13 AM, 9 Dec 2024 (IST)

తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా పేరు తెచ్చుకోవాలి : పోచారం

పోచారం

  • తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి
  • మంచి ఉద్దేశంతో సీఎం నేతృత్వంలో తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగింది
  • తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా పేరు తెచ్చుకోవాలి
  • రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహ తయారీ
  • తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా రావాలి

11:09 AM, 9 Dec 2024 (IST)

తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుండేది : పాయల్‌ శంకర్‌

పాయల్‌ శంకర్‌

తెలంగాణ తల్లి విగ్రహ తయారీకి ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది

సభలో అన్ని పక్షాల ఆలోచనతో రూపొందిస్తే బాగుండనేది మా సూచన

తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుండేది

గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ఉద్యోగులకు పెనుశాపంగా మారింది

తెలంగాణ ఉద్యమం వచ్చిందే స్థానికత కోసం

ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్‌ తీసుకోలేని పరిస్థితులు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం సరిదిద్దాలి

11:04 AM, 9 Dec 2024 (IST)

అసెంబ్లీకి రావద్దనేది విపక్ష నేతల యత్నం : శ్రీధర్‌బాబు

ప్రజా ప్రభుత్వం గొప్ప కార్యక్రమాన్ని చేపడుతోంది: శ్రీధర్‌బాబు

రాజకీయ ప్రస్థావనతో అసెంబ్లీకి రావద్దనేది విపక్ష నేతల యత్నం

అసెంబ్లీ రూల్స్‌కు విరుద్ధంగా సమావేశాలకు రాకుండా చూసే ప్రయత్నం

తెలంగాణ యావత్తు ప్రజలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నారు

ప్రత్యేక అంశంలో పాల్గొనాలని ప్రతిపక్షాలను కోరుతున్నాం

రాజకీయాలు పక్కనపెట్టి మీరు అందరూ రావాలని కోరుతున్నాం

11:01 AM, 9 Dec 2024 (IST)

అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

  • శాసనసభ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
  • అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నిరసన
  • నిరసన తెలుపుతున్న నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
  • అదానీ, రేవంత్‌ ఫొటోతో టీషర్టులు ధరించి వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు
  • అదానీ, రేవంత్‌ ఫొటోతో టీషర్టులు తొలగించి వెళ్లాలని సూచించిన పోలీసులు
  • శాసనసభలోకి అనుమతించకపోవడంపై బీఆర్‌ఎస్‌ నేతల నిరసన
  • టీషర్టులతో వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ నేతల పట్టు
  • సభలోకి అనుమతించకపోవడంతో పోలీసులతో బీఆర్‌ఎస్‌ నేతల వాగ్వాదం
  • అధికారుల వైఖరికి నిరసనగా శాసనసభ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నినాదాలు
  • నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

10:59 AM, 9 Dec 2024 (IST)

తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా రూపొందించాం: సీఎం

  • డిసెంబర్‌ 9న తెలంగాణ పర్వదినం: సీఎం
  • 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది: సీఎం
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు: సీఎం
  • రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు: సీఎం
  • నా తెలంగాణ.. కోటి రత్నాల వీణ అన్న దాశరథి మాటలు నిత్య సత్యం: సీఎం
  • భూప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతి అస్తిత్వమే: సీఎం
  • అస్తిత్వానికి మూలం సంస్కృతి.. సంస్కృతికి ప్రతిరూపమే తల్లి: సీఎం
  • స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి: సీఎం
  • తెలంగాణ జాతి భావనకు జీవం పోసింది తెలంగాణ తల్లి: సీఎం
  • నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపింది తెలంగాణ తల్లి: సీఎం
  • తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు: సీఎం
  • ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకోవాలి: సీఎం
  • తెలంగాణ తల్లికి రూపకల్పన చేసి సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నాం: సీఎం
  • తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు.. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం: సీఎం
  • తెలంగాణ తల్లి విగ్రహావిష్కారానికి ప్రజా ప్రభుత్వం సిద్ధమైంది: సీఎం
  • తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులు పరిగణలోకి తీసుకున్నాం: సీఎం
  • ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో తెలంగాణ తల్లి రూపకల్పన: సీఎం
  • గుండుపూసలు, హారం, ముక్కుపుడకతో తెలంగాణ తల్లి రూపకల్పన: సీఎం
  • ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి రూపకల్పన: సీఎం
  • చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపకల్పన: సీఎం
  • కుడిచేతితో జాతికి అభయాన్ని ఇస్తున్నట్లు తెలంగాణ తల్లి విగ్రహ తయారీ: సీఎం
  • ఎడమ చేతిలో వరి, జొన్నలు, సజ్జ పంటలతో తెలంగాణ తల్లి విగ్రహ తయారీ: సీఎం
  • తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు రూపంతో విగ్రహ తయారీ: సీఎం
  • తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా రూపొందించాం: సీఎం
  • చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణాన్ని తెలియజేస్తున్నాయి: సీఎం
Last Updated : Dec 9, 2024, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details