Telangana 10th Results 2024 On May 1st : తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఫలితాల ప్రకటనకు ముహూర్తం సిద్ధమైంది. ఈనెల 30న లేదా వచ్చే నెల 1న ఉదయం ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది పరీక్షలు రాశారు. దీనికి సంబంధించిన మూల్యాంకనం శనివారం పూర్తయింది.
TS SSC Board Results 2024 :ఈ క్రమంలోనే వారం రోజులపాటు ఫలితాల డీకోడింగ్ అనంతరం ఈనెల 30న లేదా వచ్చే నెల 1న ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడిని ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకోసం విద్యాశాఖ మొత్తం 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్షలు జరిగాయి. అయితే పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం లోనికి అనుమతించారు.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips