తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదలతో బైక్​లు దెబ్బతిన్నాయా? - ఇలా చేస్తే తక్కువ ఖర్చుతో బయటపడొచ్చు! - Tips for Flooded Bike Repair

Flooded bike repair: తెలుగు రాష్ట్రాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. లక్షల మంది ఇళ్లు నీట మునిగి, సామగ్రి వరదలో కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు. ముంపు ప్రాంతాల్లో లక్షలాది ద్విచక్ర వాహనాలు వరదలో మునిగిపోయాయి. అయితే, వాటి మరమ్మతు విషయంలో అప్రమత్తంగా ఉండాలని టెక్నీషియన్లు సూచిస్తున్నారు. ఇప్పటికే వరద కారణంగా నష్టపోయిన వారంతా అనాలోచిత నిర్ణయాలతో మరింత నష్టపోవద్దని చెప్తున్నారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 5:19 PM IST

Tips for Flooded Bike Repair:తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు. వేలాది ఇళ్లు మొదటి అంతస్తు వరకూ నీళ్లు రావటంతో సామగ్రి వరదలో కొట్టుకుపోయింది. ఇళ్ల బయట నిలిపి ఉంచిన వాహనాలు వరదనీటిలోనే ఉండిపోయాయి. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన అనంతరం వాటిని పునః వినియోగం కోసం బాధితులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మునిగిపోయిన లక్షలాది వాహనాల విషయంలో ఏం చేయాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం బ్యాంకర్లు, ఇన్సూరెన్సు కంపెనీలతో సంప్రదింపులు చేస్తోంది. అయితే స్వల్ప మరమ్మతుతోనే వాటిని పునః వినియోగం చేసుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులకు పెద్దగా ఇబ్బందేమీ ఉండదని భరోసా ఇస్తున్నారు. వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ముంపులో పాడైన వాహనాల రిపేర్, బీమా విషయంలో కొంత వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది.

అయితే.. వాహనం వరదలో మునిగిపోతే కంగారు పడాల్సిన పనిలేదని ఏపీలోని విజయవాడకు చెందిన బైక్ టెక్నీషిన్ అలేఖ్య భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహన యజమానులకు పలు సూచనలు చేశారు.

  • ఇంజిన్ మునిగిపోతే తప్ప షోరూమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.
  • పార్ట్స్ మార్పించాల్సిన అవసరం లేదు.
  • ఇంజిన్ ఆయిల్, ఎయిర్​ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ మార్చుకుంటే సరిపోతుంది.
  • వీటికి బైక్​ మోడల్​ ను బట్టి 3వేలకు మించి ఖర్చు ఉండదు.
  • ఒక వేళ ఇంజిన్ మునిగిపోయినట్లయితే షోరూమ్​ కు తీసుకెళ్లాలనే ఆలోచనతో బండిని స్టార్ట్ చేయొద్దు.
  • బండిని స్టార్ట్ చేసి రన్ చేస్తే ఇంజిన్ బోర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
  • బండి స్టార్ట్ చేసుకుని వెళ్తే ఇంజిన్​లోకి నీళ్లు వెళ్లి దాదాపు 15నుంచి 20వేలకు పైగా ఖర్చవుతుంది.
  • పెట్రోల్ ట్యాంకు సహా వరదలో మునిగిపోతే బడ్జెట్ ఎక్కువే అవుతుంది. ఇంజిన్ వరకే మునిగితే సేఫ్ జోన్​లో ఉన్నట్లే.
  • కొత్త వాహనాలకు వారంటీ ఉంటుంది కాబట్టి ఆందోళన అక్కర్లేదు.
  • వారంటీలో షోరూమ్​ వాళ్లే రిపేర్ చేసే అవకాశాలున్నాయి.
  • తక్కువ ఖర్చులో రిపేర్ పూర్తి కావాలంటే వారంటీ ఉంటే సరిపోతుంది.
  • కొన్ని వాహనాలకు ఇన్స్యూరెన్స్ కూడా వర్తిస్తుంది.
  • కస్టమర్ చేయించుకున్న బీమాలో వరదలు, భూ కంపాల కవరేజీ ఉందో లేదో చెక్​ చేసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details