తెలంగాణ

telangana

ETV Bharat / state

కీచక ఉపాధ్యాయుడిని పోలీసులకు పట్టించిన 'గుడ్​ టచ్ - బ్యాడ్​ టచ్' పాఠం - TEACHER MISBEHAVING WITH STUDENTS

పాఠశాల విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు - గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ అవగాహన సదస్సులో పోలీసుకు చెప్పిన విద్యార్థినులు - మాస్టార్​కు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు

A Teacher Harassed a Student In Kakinada
Teacher Misbehaving with Students In Kakinada (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2024, 9:03 AM IST

Teacher Misbehaving with Students In Kakinada :ఉపాధ్యాయుడు అంటే తండ్రిలాంటివాడు. విద్యాబుద్ధులు నేర్పుతూ విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. అయితే కొందరు గురువులు గాడి తప్పుతూ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలోని కాకినాడలో చోటు చేసుకుంది. చదువు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే పాఠశాలలోని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విషయం ఎవరికి చెప్పాలో తెలియక ఆ చిన్నారులు ఇన్నాళ్లూ లోలోన కుమిలిపోయారు. ఇంతలో పాఠశాలలో ‘గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌’పై అవగాహన సదస్సు నిర్వహించడంతో ఆ పిల్లలకు కొండంత ధైర్యం వచ్చింది. ఆ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులకు పట్టించేలా చేసింది.

కాకినాడ ఒకటో పట్టణ సీఐ ఎం.నాగదుర్గారావు వివరాల ప్రకారం : ఏపీలోని కాకినాడలోని శ్రీగంటి మోహన బాలయోగి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో శనివారం ‘గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌’పై వన్‌టౌన్‌ మహిళా పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినులు కొంతమంది సదస్సుకు వచ్చిన మహిళా పోలీసు వద్దకు వచ్చి ‘అక్కా.. లెక్కల మాస్టారు శ్రీనివాసరావు మాపై చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు’ అని చెప్పారు.

దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు :ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులకు తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్న ఉపాధ్యాయుడిని కొట్టుకుంటూ పాఠశాలకు తీసుకెళ్లారు. ఎంఈఓ వారిని అడ్డుకునేందుకు యత్నించినా వదల్లేదు. వన్‌టౌన్‌ సీఐ వచ్చి టీచర్‌ను అదుపులోకి తీసుకోగా తమకు అప్పగించాల్సిందేనని తల్లిదండ్రులు, బంధువులు పోలీసు వాహనం ముందు కూర్చున్నారు. న్యాయం చేస్తామని సీఐ చెప్పడంతో చివరికి అడ్డుతొలిగారు. ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు.

తల్లిదండ్రులు పిల్లలకు తప్పకుండా ఇవి నేర్పించాలి.

  • తల్లిదండ్రులు తమ పిల్లలకు శరీర భద్రత గురించి అవగాహన కల్పించాలి.
  • గుడ్​ టచ్​ -బ్యాడ్ ​టచ్​ అంటే ఏంటో పిల్లలకు చెప్పాలి.
  • ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు, బడిలో టీచర్లకు తెలియజేయాలని చెప్పాలి.
  • పిల్లలతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు ధైర్యంగా ఎలా రక్షించుకోవాలో నేర్పాలి.
  • తల్లిదండ్రులకు తెలియకుండా ఎంత సుపరిచితులైనా వారి వెంట పిల్లలను వెళ్లొద్దని చెప్పాలి.
  • పిల్లలకు ఆత్మరక్షణ విద్యలో కచ్చితంగా శిక్షణ ఇవ్వాలి.

చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన కీచక పీఈటీ - ఆందోళనలు చేపట్టిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు - A Teacher Harassed a Student

మీ ఇంట్లో ఆడపిల్లలున్నారా? - ఐతే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే! - Prevention of Violence On Children

ABOUT THE AUTHOR

...view details