TDP Leaders Warm Welcome to Chandrababu at NTR Bhavan:టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ భవన్ గేటు వద్ద ఆయనకు పోలీసులు గౌరవ వందనం ఇచ్చారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూటమికి అనుకూలంగా రావటంతో, చంద్రబాబుకు ముందస్తు అభినందనలు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సీఎం, సీఎం నినాదాలతో ఎన్టీఆర్ భవన్ మార్మోగింది.
పోలింగ్ తర్వాత చంద్రబాబు ఇవాళే మళ్లీ పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ శ్రేణులు ఆయనకు ముందుస్తు శుభాకాంక్షలు తెలిపారు. సంబరాలకు రేపటి వరకూ శక్తిని కూడగట్టుకు ఉంచండి అంటూ శ్రేణులతో చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. పార్టీ బ్యాకాఫీస్ పని చేసిన నేతలకు చంద్రబాబు అభినందించారు.
రాష్ట్రాలు రెండుగా మారినా తెలుగు ప్రజలంతా ఒక్కటే: చంద్రబాబు - Chandrababu tweet
సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు:సైకిల్ తొక్కే ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగానూ, సమాజానికీ మేలు చేసే ఉత్తమ వ్యాయామం సైక్లింగ్ అని అన్నారు. ప్రతీ ఒక్కరూ సైకిలెక్కాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
చంద్రబాబు అభినందనలు:ఎన్నికల్లో తన పర్యటనలు కోఆర్డినేట్ చేసిన బృంద సభ్యుల్ని చంద్రబాబు అభినందించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని పెందుర్తి వెంకటేష్, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు, గంటా గౌతమ్, రవి యాదవ్, రాజశేఖర్, శ్రీనివాస్ కోఆర్డినేట్ చేశారు. ప్రచారంలో భాగంగా రోజుకు 3 నుంచి 5 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనేలా బృందం సమన్వయం చేసింది. బాగా కష్టపడి పని చేశారంటూ బృంద సభ్యుల్ని చంద్రబాబు తన నివాసంలో అభినందించారు.
జమ్మలమడుగులో భారీ బందోబస్తు - అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు: డీఎస్పీ - Police Picket In Jammalamadugu
Chandrababu Conference with Alliance leaders:సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పని చేశారని కితాబిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు పురందరేశ్వరి, అరుణ్ సింగ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌లు పాల్గొన్నారు.
కౌంటింగ్‌కి వేళాయే - ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు - 144 సెక్షన్ అమలు చేస్తూ ముమ్మర నిఘా - Counting Arrangements in Palnadu