ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రామోజీరావు వ్యక్తి కాదు ఓ వ్యవస్థ- సమాజానికి ఆయన మార్గదర్శి' - tdp Leaders Tribute to ramoji Rao

TDP Leaders Tribute to Ramoji Rao: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అని తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రముఖులు కొనియాడారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రప‌టం వ‌ద్ద వారు నివాళులర్పించారు. ఈనాడు ఎండీ కిర‌ణ్​తోపాటు కుటుంబ స‌భ్యుల‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

TDP Leaders Tribute to Ramoji Rao
TDP Leaders Tribute to Ramoji Rao (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 11:15 AM IST

TDP Leaders Tribute to Ramoji Rao :రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు తెలుగునాట ఈనాడు దినపత్రికను స్థాపించి తెలుగు ప‌త్రికా రంగాన్ని మ‌లుపు తిప్పిన సంపాద‌కుడని తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రముఖుల కొనియాడారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రప‌టం వ‌ద్ద వారు నివాళులర్పించారు. ఈనాడు ఎండీ కిర‌ణ్​తోపాటు ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రామోజీ మరణం తెలుగు జాతికి తీరని లోటు :రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అని తెలుగుదేశం పార్టీ నేతలు బుద్దా వెంకన్న, వి.ప్రభాకర్ చౌదరి అన్నారు. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు సేవలను గుర్తు చేసుకున్న నేతలు ఎప్పుడూ ఆయన పేదల పక్షమే వహించారన్నారు. రామోజీ మరణం తెలుగు జాతికి తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

లైవ్​ పెయింటింగ్​ వేసి రామోజీకి నివాళులు- భారతరత్న ఇవ్వాలని రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు! - Tribute To Ramoji Rao

రామోజీరావు ఓ విజనరీ : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు నవతరానికి స్ఫూర్తి అని బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు స్ఫూర్తితో తాను ఎదిగానన్న ఎంఎస్‌కే ఆయనో విజనరీ అని ప్రశంసించారు.

రామోజీరావు మేరునగధీరుడు :ఉత్తమ సమాజ నిర్మాణం కోసం అక్షర యజ్ఞం చేసిన రామోజీరావు చిరస్మరణీయుడని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్‌ అన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబం నుంచి వచ్చి ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించిన రామోజీరావు మేరునగధీరుడని ఆయన ప్రశంసించారు.

అక్షర యోధుడుకి పెదపారుపూడి ఘన నివాళి- స్వగ్రామంలో రామోజీరావు విగ్రహం - Tribute to Ramoji Rao

సారా, మద్యపాన నిషేధం కోసం శ్రమించారు :సమాజానికి మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి రామోజీరావు అని తెలుగుదేశం పార్టీ నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ కొనియాడారు. సారా, మద్యపాన నిషేధం కోసం శ్రమించారని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారని అన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.

తనలో ఎంతో స్ఫూర్తి నింపారు : విలువలే జీవితమని నమ్మిన మంచి మనిషి రామోజీరావు అని చిత్తూరు జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు ఉప్పలపాటి రమేశ్‌ బాబు అన్నారు. ఆయన తనలో ఎంతో స్ఫూర్తి నింపారని గుర్తు చేసుకున్నారు. రామోజీ సేవా మార్గం ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ఆయన తెలిపారు.

రూపుదిద్దుకుంటున్న తెలుగు కీర్తి పతాక రామోజీ విగ్రహం - తుది మెరుగులు దిద్దుతున్న శిల్పి రాజ్‌కుమార్‌ వుడయార్‌ - Ramojirao Statue

ABOUT THE AUTHOR

...view details