TDP Leaders Comment on Vijayasai Reddy:సొంత చిన్నాయనను చంపి జైలుకెళ్లిన చరిత్ర విజయసాయి రెడ్డి కుటుంబానిదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. రాజీనామా పేరుతో రాత్రి నుంచి విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు, నక్కజిత్తులు చూస్తున్నామన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు వ్యతిరేకంగా పోరాడే తనపై కక్షకట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి అని సోమిరెడ్డి దుయ్యబట్టారు. తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయాల కోసం అమ్ముకున్న కుటుంబం తమదని సోమిరెడ్డి గుర్తు చేశారు. విజయసాయి రెడ్డితో పాటు ఆయన వియ్యంకుడి కుటుంబం చేసిన పాపాలను ఎన్ని జన్మలెత్తినా దేవుడు క్షమించరని, ఫలితం అనుభవించి తీరాల్సిందేనని సోమిరెడ్డి అన్నారు.
వైఎస్సార్సీపీ మునిగిపోయిన నావ:ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయితో విశాఖలో పడిన ఇబ్బందులు, జరిగిన విధ్వంసం, దాడులను ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. వైఎస్సార్సీపీ మునిగిపోయిన నావ అని ఎప్పుడో చెప్పామని కానీ అది ఇప్పుడు నిజమవుతోందని అన్నారు. జగన్ నైజమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఇంకా కొంతమంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటే నాపై కేసులు ఎందుకు తొలగిస్తారు : విజయసాయిరెడ్డి