Tips to Clean Chopping Board : చాలా మంది మహిళలు వంటింట్లో కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాయగూరలు శుభ్రంగా కడిగి వాటిని చాపింగ్ బోర్డుపై ఉంచి చకచకా కట్ చేస్తున్నారు. వెజిటబుల్స్ తరిగిన తర్వాత ఎక్కువ మంది చాపింగ్ బోర్డ్ ట్యాప్ కింద ఉంచి పైపైన కడిగి పక్కన పెట్టేస్తుంటారు. ఆపై కూరగాయలు కట్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్లీ శుభ్రం చేస్తుంటారు. అయితే, ఇలా చాపింగ్ బోర్డు పైపైన శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా తయారై కొన్నిరోజులకు దుర్వాసన వస్తుంది. ఈ క్రమంలో చాపింగ్ బోర్డు బ్యాడ్‌స్మెల్ రాకుండా డీప్ క్లీన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు మీ కోసం.
బేకింగ్ సోడా :
సాధారణంగా బజ్జీలు, కేక్‌ల రుచిని పెంచడానికి బేకింగ్ సోడా వంటింట్లో వాడుతుంటాం. ఈ వంటసోడాతో చాపింగ్ బోర్డ్ దుర్వాసనను కూడా తొలగించవచ్చు. ఇందుకోసం చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు చిలకరించండి. ఆపై బేకింగ్ సోడా చల్లి, నిమ్మచెక్కతో 5 నిమిషాల పాటు రుద్దండి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ 15 నిమిషాలు పక్కన ఉంచండి. అనంతరం నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. చాపింగ్ ఎలాంటి దుర్వాసన రాకుండా ఉంటుంది.
ఉప్పు :
మనం ఏ కూర వండినా సరిపడా ఉప్పు వేయకపోతే రుచి అంతగా ఉండదు. అయితే, ఉప్పుతో కూడా చాపింగ్ బోర్డును డీప్ క్లీన్ చేయచ్చు. ఇందుకోసం చాపింగ్ బోర్డుపై నీళ్లు చల్లి కొద్దిగా ఉప్పు వేయండి. ఆపై నిమ్మ చెక్కతో కాసేపు రుద్దండి. తర్వాత ఓ పది నిమిషాలు చాపింగ్ బోర్డుని పక్కన ఉంచి, గోరువెచ్చని నీటితో క్లీన్ చేస్తే సరి!
వెనిగర్ :
వంటల్లో, ఇంటి శుభ్రతలో వెనిగర్ వాడడం మనలో చాలా మందికి అలవాటే. వెనిగర్‌తో చాపింగ్ బోర్డుని కూడా శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని, కొద్దిగా వెనిగర్ కలపండి. ఆపై మిశ్రమాన్ని చాపింగ్ బోర్డుపై చల్లండి. ఒక 10 నిమిషాల తర్వాత మృదువైన స్క్రబ్బర్‌తో రుద్దుతూ చాపింగ్ బోర్డుని క్లీన్ చేస్తే సరిపోతుంది.
మరికొన్ని చిట్కాలు :
- కూరగాయలు కట్ చేసిన ప్రతిసారీ గోరువెచ్చని నీటితో చాపింగ్ బోర్డు శుభ్రం చేస్తే మంచిది. ఇలా వెంటనే కడగడం వల్ల మరకలు పడడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు ఉండవు.
- అలాగే చాపింగ్ బోర్డును క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదని గుర్తుంచుకోండి.
- ఎందుకంటే ఇవి కటింగ్ బోర్డు నాణ్యతను దెబ్బతీస్తాయి.
- చాపింగ్ బోర్డు బాగా ఆరబెట్టి తర్వాతే దాచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అవిసె గింజల్లో జుట్టు ఆరోగ్య గుట్టు - హెయిర్‌ప్యాక్‌తో సమస్యలకు చెక్
తిరుమలలో గోవిందా, గోవిందా అని ఎందుకంటారో తెలుసా? - అసలు విషయం ఇదీ!