TDP Janasena BJP Alliance Seats Allotment :తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారవ్వడంతో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలన్న దానిపై నేడు మూడు పార్టీల నేతలు చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతి (Amaravati) చేరుకున్న చంద్రబాబు పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Shekawat)తో భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు 8 గంటలపాటు చర్చలు కొనసాగాయి.
సీట్ల సర్దుబాటుపై చర్చించి రెండు రోజుల్లో మలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేసేలా చంద్రబాబు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంశంపై పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపారు.పొత్తులోభాగంగా జనసేన-బీజేపికి 31 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు కేటాయించారు.
BJP TDP Janasena Alliance :ముందు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు(Parliament Seats) ఒప్పందం కుదిరింది. ఇందులో జనసేన 24 స్థానాలు కేటాయించారు. ఇప్పుడు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడంతో జనసేన తమకు కేటాయించిన మూడు స్థానాలను వదులుకుని 21 సీట్లలో పోటీ చేయనుంది. టీడీపీ సైతం తమ కోటా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. అలాగే లోక్‌సభలో తొలుత జనసేన మూడు సీట్లు కేటాయించగా, బీజేపీకి 6 లోక్‌సభ స్థానాలు ఇవ్వడంతో జనసేన తమకు ఇస్తానన్న స్థానంలో ఒకటిని వదులుకుంది.
ఏపీలో ఎన్నికలు ఏకపక్షమే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది- చంద్రబాబు
ఉదయం కేంద్ర మంత్రి షెకావత్, జయంత్ పాండా, శివ ప్రకాష్, పురందేశ్వరి, తదితర బీజేపీ నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అప్పటికే తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి చంద్రబాబు నివాసానికి వచ్చారు. జనసేన తరఫున పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు మూడు పార్టీల మధ్య దాదాపు 8 గంటల పాటు కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు.
AP Politics in 2024 Elections :చిలకలూరిపేట బొప్పూడిలో ఈనెల 17న టీడీపీ-బీజేపీ-జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు . ఈ సభ ఏర్పాట్లను నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు 13 కమిటీలను నియమించారు. మూడు పార్టీల్లోని నేతలతో కమిటీలు ఏర్పాటు చేశారు. అలాగే అధికార పార్టీ పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను(Revenue System) అడ్డం పెట్టుకోని చేస్తున్న అక్రమాల తీరు, సచివాలయ వ్యవస్థ దుర్వినియోగం అంశాలపై సమావేశంలో నేతలు చర్చలు జరిగినట్లు సమాచారం.