తెలంగాణ

telangana

ETV Bharat / state

నలుగురు ఉసురు తీసిన గొలుసుకట్టు పథకం కేసు - ప్రధాన నిందితుడు అరెస్ట్ - Tangutur suicide case updates - TANGUTUR SUICIDE CASE UPDATES

Tangutur Suicide Case Updates : గొలుసుకట్టు దందాలో మోసపోయి తన ముగ్గురు కుమారులను చంపి తాను బలవన్మరణానికి పాల్పడ్డ వ్యక్తి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగటూర్ కేసులో ఏపీలోని రాజాంకు చెందిన నిందితుడు తిరుపతిరావును రిమాండ్‌కు తరలించారు. పెట్టుబడులకు కమిషన్ల పేరుతో వందలాది మందిని మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Tangutur Suicide Case Updates
Tangutur Suicide Case Updates

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 8:38 AM IST

గొలుసుకట్టు పథకాలతో మోసగిస్తున్న నిందితుడు తిరుపతిరావు అరెస్ట్

Tangutur Suicide Case Updates :ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లాకు చెందిన తిరుపతిరావు డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2019లో స్థానికంగా ఓ గొలుసుకట్టు (Chain link Scam) పథకంలో చేరాడు. మొదట్లో మరో ఇద్దర్ని చేర్పించడంతో కొంత కమీషన్‌ వచ్చింది. ఆ తర్వాత కొత్త వ్యక్తుల్ని స్కీములో చేర్చకపోవడంతో కమీషన్‌ రాలేదు. మనీ సర్క్యులేషన్‌ పథకం గురించి యూట్యూబ్‌లో వెతికిన నిందితుడు తానే సొంతంగా దందా ప్రారంభించాడు. తన తండ్రి పేరిట జీఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాడు. రూ.600లు చెల్లించి ఈ పథకంలో చేరిన సభ్యులు ఒక్కో కొత్త వ్యక్తిని చేర్పిస్తే 10 శాతం కమీషన్‌ ఇస్తానని ప్రచారం చేశాడు. 500 మందిని చేర్పిస్తే రూ.15,500లు ఇస్తానంటూ డబ్బులు వసూలుకు తెరతీశాడు.

వేలల్లో బాధితులు.. రూ.వేల కోట్లలో మోసాలు.. గొలుసుకట్టు ఆట కట్టించలేరా..?

Father killed Three Children Then Committed Suicide : రంగారెడ్డి జిల్లా టంగటూర్‌కు చెందిన నీరటి రవి తిరుపతిరావు మాటలు నమ్మి స్కీంలో చేరాడు. దాదాపు రూ.13 లక్షలు చెల్లించిన అతను తనతోపాటు టంగుటూరు సమీప గ్రామాల వారిని చేర్పించారు. ప్రారంభంలో కమీషన్‌ వచ్చినా తర్వాత రాకపోవడంతో గ్రామస్థులు రవిని నిలదీశారు. తిరుపతిరావు చేతిలో మోసపోయినట్లు గుర్తించిన రవి డబ్బు తిరిగివ్వాలన్న గ్రామస్థుల ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. దీంతో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.

గొలుసు కట్టు మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

Money Circulation Schemes Frauds : ఈ క్రమంలోనే రవి భార్యను తల్లిగారింటికి వెళ్లాలని, పిల్లలు తనతో ఉంటారని చెప్పాడు. అర్ధరాత్రి కుమారులు నిద్రపోతున్న సమయంలో పడుకున్నచోటే తాడుతో మెడకు ఉరి బిగించి చంపాడు. తర్వాత తాను నిర్మిస్తున్న ఫంక్షన్‌హాల్‌ వద్దకు వెళ్లి రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యవహరంపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు సూత్రధారైన తిరుపతిరావును అదుపులోకి తీసుకున్నారు.

"నీరటి రవికి ఓ గొలుసుకట్టు స్కీంలో వాట్సాప్ గ్రూప్ ద్వారా తిరుపతిరావు పరిచయమయ్యాడు. తొలుత రూ.500, రూ.600ల పథకంలో వ్యక్తులను చేర్పించాడు. ఇందుకు గాను కమీషన్ వచ్చేది. అలా నీరటి రవి తిరుపతిరావు మాటలు నమ్మి మరికొంత మందిని ఇందులో చేర్పించాడు. తొలుత కమీషన్ వచ్చినా తర్వాత రాకపోవడంతో అందులో చేరిన వారు నీరటి రవిని ప్రశ్నించారు. తిరుపతిరావు చేతిలో మోసపోయానని గుర్తించిన అతను ముగ్గురు కుమారులకు ఉరివేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించాం." - వెంకటరమణ గౌడ్‌, నార్సింగి ఏసీపీ

తిరుపతిరావు ప్రారంభించిన గొలుసుకట్టు పథకంలో మృతుడు నీరటి రవి దాదాపు 900 మందిని చేర్పించినట్లు తెలుస్తోంది. రవి ఒక్కడే నేరుగా రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టగా మిగతా వాళ్లందరూ జమ చేసిన డబ్బు కోట్లలోనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి గొలుసుకట్టు పథకాలను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

నలుగురి ప్రాణాలను బలి తీసుకున్న గొలుసుకట్టు మోసం - ఒత్తిళ్లు తట్టుకోలేకే పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details