Suspended SIB DSP Praneeth Rao Phone Tapping Case Update :స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ కాల్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అటు రాజకీయాల్లోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సస్పెన్షన్‌లో ఉన్న ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) సహా మరికొందరిపై ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అదనపు ఎస్పీ రమేశ్ ఫిర్యాదులో పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు.
ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ ఫిర్యాదులో కీలక అంశాలు :గతంలో స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్‌లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీగా పని చేసిన సమయంలో పంజాగుట్టలోని ఎస్‌ఐబీ కార్యాలయం (SIB Office)లో ఉన్న 2 గదులను వినియోగించుకుంటూ అనధికారికంగా అతని బృందంతో 17 కంప్యూటర్లను వాడుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాగా దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తుల పేరిట ప్రొఫైల్‌లు తయారుచేశాడు. అదే సమయంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
కన్ను పడిందా కాజేయడం పక్కా - పార్కింగ్ కార్లే టార్గెట్‌గా అంతర్రాష్ట్ర దొంగల చేతివాటం
అసలేం జరిగిందంటే :గతేడాది డిసెంబరు 4వ తేదీ రాత్రి సీసీ టీవీలు ఆఫ్ చేసి డేటానంతా తన వ్యక్తిగత పెన్‌డ్రైవ్, హార్డ్‌డిస్క్‌లలో ప్రణీత్ కాపీ చేసుకున్నాడు. అనంతరం కంప్యూటర్లో ఉన్న డేటాను డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కంప్యూటర్‌కు సంబంధించిన 42 హార్డ్‌డిస్క్‌లను మాయం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. అందులో ఉన్న సీడీఆర్, ఐఎంఈఐ నంబర్లు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటాను చెరిపేసి అదో రోజు ఎలక్ట్రీషన్ సాయంతో సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి ఈ వ్యవహరమంతా నడిపించినట్లు అధికారులు గుర్తించారు.
Phone Tapping Case :దీన్ని బట్టి చూస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Telangana Assembly Result) మరుసటి రోజే ప్రణీత్ రావు ఈ చర్యలకు పాల్పడినట్లు అర్థమవుతోంది. కాగా దీనిపై ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డీ.రమేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణీత్‌రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రణీత్‌రావు సహా ఇతరులపై ఐపీసీ సెక్షన్ 409,427,201,120(బీ), రెడ్ విత్ 34, పీడీపీపీ యాక్టు, ఐటీ యాక్టు కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల న్యాయవాది అరుణ్ కుమార్ కూడా ప్రణీత్‌రావుపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ప్రణీత్‌రావు రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.
'తన హోదాను అడ్డుపెట్టుకొనే ఇలా విరుద్ధంగా చేశారు' - కాల్ ట్యాపింగ్ కేసులో నిజాలు
ఆకాశం నుంచి ఊడిపడిన మంత్రపు పెట్టె - రూ.50 కోట్లకు బేరం - చివరకు?