కబ్జా ఆరోపణలు - మల్లారెడ్డి యూనివర్సిటీలో అధికారుల సర్వే - MALLAREDDY UNIVERSITY SURVEY
మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ అధికారుల సర్వే - జిల్లా కోర్టు ఉత్తర్వులతో సర్వే చేసిన అధికారులు
![కబ్జా ఆరోపణలు - మల్లారెడ్డి యూనివర్సిటీలో అధికారుల సర్వే Mallareddy University Survey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/1200-675-23517682-thumbnail-16x9-mallareddy.jpg)
Published : Feb 11, 2025, 10:45 AM IST
Mallareddy University Survey :మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సోమవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. బహదూర్‌పల్లికి చెందిన పిట్ల యాదగిరి, పిట్ల సత్తెమ్మలు తమ 7 ఎకరాల భూమిని కబ్జా చేసి యూనివర్సిటీ నిర్మించారని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2014 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని, అధికారం అడ్డుపెట్టుకుని అప్పట్లో కబ్జా చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలో సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని ఈ నెల 2న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు.