Supreme Court on AP CM Jagan Disproportionate Assets Case : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిజగన్ అక్రమాస్తుల కేసుపై (CM Jagan Illegal Assets) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
CM Jagan Illegal Assets Case : డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు సుప్రీంకోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ సవ్యంగానే జరుగుతోందని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదని, అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదో చెప్పాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.
CBI Court On Jagan: 'కేసుల విచారణకు జగన్ ఎందుకు హాజరు కావడంలేదు?'