Johnny Master Bail Cancellation Petition : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు అక్టోబరు 24న ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్‌కు అక్టోబర్ 24న హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జానీ మాస్టర్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రలతో కూడిన ధర్మాసనం దీన్ని డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ : లైంగిక వేధింపుల కేసులో సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 24న జానీ మాస్టర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్, వారి కుటుంబ సభ్యులు బాధితురాలిని బెదిరింపులకు పాల్పడవద్దని, ఆమె పని చేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు షరతులు విధించింది. మైనర్‌గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు తెలిపారు. షూటింగ్ సమయంలోనూ మేకప్ వ్యాన్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆమె పోలీసులకు వివరించారు. తాను నిరాకరిస్తే మేకప్ వ్యాన్‌లో ఉన్న అద్దానికేసి తలను బాదినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు.