Father's Day Special Stories 2024 :ఆడపిల్లలకు వాళ్ల నాన్నతో ఉండే అనుబంధమే వేరు. పుట్టినప్పటి నుంచి మా ఇంట సిరి పుట్టింది అని మురిసి, ఏం చేస్తే కందిపోతారోన్నంత గారాబంగా పెంచి ఉన్నత స్థాయిలో నిలబడే వరకు వెన్నంటి నడుస్తాడు. జీవితాంతం మనతో ఉండకపోయినా ఎలా బతకాలి అన్న భరోసా ఇస్తాడు. ఆడపిల్ల పుట్టాక నాన్నలకు వారి కూతురే యువరాణి. వారి ప్రేమకు వారే సాటి. ఫాదర్స్ డే సందర్భంగా తమ వెన్నంటి ఉండి గెలుపు మార్గంలో నడిపించిన నాన్నల గురించి కూతుళ్ల మాటల్లో
నేను సివిల్స్ వైపు రావడానికి కారణం నాన్నే. పేరు ప్రకాష్‌రావు, కానిస్టేబుల్. ఆయనెప్పుడు నువ్వు ఏం చేసినా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలనేవారు. చిన్నప్పట్నుంచీ అనాథాశ్రమాలకు తీసుకెళ్లడం, ఆయన చూసిన సంఘటనలు నాతో చెప్పేవారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన ఆఫీసర్లు, వారి సమాజసేవ గురించి పేపర్లో వచ్చే కథనాల గురించి చదవమనేవారు. ఆ మాటలు నన్ను సేవ చేయాలనే దిశగా నడిపించాయి.
అది నన్ను సివిల్స్ వైపు నడిపేలా చేసింది :మాది బోనకల్ మండలంలోని గోవిందాపురం. నేను ఏడోతరగతిలో ఉన్నాననుకుంటా ఓసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కలెక్టర్‌కు గౌరవవందన చేశారు. అది నన్ను ఆకర్షించిది. ఆరోజే అనుకున్న కలెక్టర్ కావాలని. అలా సివిల్స్ వైపు అడుగులు వేశా. సివిల్స్‌లో నాలుగుసార్లు విఫలమయ్యా. ఐదోసారి ప్రయత్నిస్తుంటే ప్రోత్సహించారు. ర్యాంకు వచ్చినప్పుడు ఇది నీ మొదటిమెట్టే ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని నా బాధ్యత గుర్తు చేశారు. నాకు వచ్చిన ర్యాంకుకి ఐఆర్ఎస్ వస్తుంది కానీ ఐఏఎస్ రావట్లేదు. మళ్లీ రాస్తానని చెప్పాను. ఇది కూడా సమాజానికి ఉపయోగపడే వేదికే కదా అని నాన్న అన్నారు. అయినా నాకు నచ్చిందే చేయమని చెప్పారు.
Father's Day Special : ఉప్పొంగిన నాన్న గుండె - ట్రైనీ ఐఏఎస్ కుమార్తెకు ఐపీఎస్ తండ్రి సెల్యూట్