ETV Bharat / entertainment

'శ్రీలీల వల్ల జీవితంలో తొలిసారి అలా చేయాల్సి వచ్చింది!' : అల్లు అర్జున్​ - ALLUARJUN COMMENTS ON SREELEELA

'కిస్సిక్'​ సాంగ్​ గురించి మాట్లాడిన అల్లు అర్జున్​ - శ్రీలీలపై ఇంట్రెస్టింగ్​ కామెంట్స్

Kissik Song Allu arjun Sreeleela
Kissik Song Allu arjun Sreeleela (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 6:40 AM IST

Kissik Song Allu arjun Sreeleela : పుష్ప 2 : ది రూల్‌ చిత్రంతో బాక్సాఫీస్‌ను రూల్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌. దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. రష్మిక హీరోయిన్​గా నటించగా, శ్రీలీల స్పెషల్​ సాంగ్​లో సందడి చేసింది. అయితే అల్లు అర్జున్‌ శ్రీలీల కలిసి చేసిన 'కిస్సిక్‌' సాంగ్​ను చెన్నై వేదికగా జరిగిన పుష్ప వైల్డ్‌ ఫైర్‌ వేడుకలో రిలీజ్ చేశారు. ఈ సాంగ్​లో శ్రీలీల, బన్నీ వేసిన మాస్‌ స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాయి.

ఈ వేడుకలో హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ "పుష్ప వైల్డ్‌ ఫైర్‌ ఎలా ఉంటుందో డిసెంబరు 5 నుంచి దేశం మొత్తం చూస్తుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరి మనసుల్ని తాకుతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ వల్లే ఈ సినిమా తెరకెక్కించడం సాధ్యమైంది. సుకుమార్‌ నా లైఫ్​. తన వల్లే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. దేవి శ్రీ అందరికీ సంగీతం ఇస్తాడు. కానీ నాకు మాత్రం అదనంగా ప్రేమను పంచుతాడు. ఈ సినిమా కోసం నేను, రష్మిక కలిసి నాలుగేళ్లు జర్నీ చేశాం. ఇక నేను మొదటి సారి ఓ సాంగ్​ కోసం కాస్త ఎక్కువగా జాగ్రత్త పడ్డాను. అందుకు కారణం శ్రీలీల. 'కిస్సిక్‌' సాంగ్​లో ఆమె ఎలా డ్యాన్స్‌ చేసిందో మీరు తెరపై చూస్తే అర్థమవుతుంది" అని అన్నారు.

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్​ మాట్లాడుతూ "నేను ఈ సినిమా ఫస్ట్​ హాప్​ చూసినప్పుడే ఫిదా అయిపోయాను. సెకండాఫ్ చూశాక మైండ్ బ్లాక్ అయింది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూపించాడు. వచ్చే వారం మరో సాంగ్​ రిలీజ్ అవుతుంది. అందులో అల్లు అర్డున్ ఊరమాస్‌ స్టెప్పులు చూస్తారు" అని పేర్కొన్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో శ్రీలీల, నెల్సన్‌ దిలీప్‌ కుమార్, వై.రవిశంకర్, నవీన్‌ ఎర్నేని, ఆదిత్య రామ్, అర్చన కల్పాతి సహా పలువురు పాల్గొని సందడి చేశారు.

'పుష్ప' నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్- బన్నీ, శ్రీలీల స్టెప్పులు చూశారా?

ఆయన వల్లే ఈరోజు నేనిలా అయిపోయాను : శ్రీలీల ఎమోషనల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.