ETV Bharat / state

'మా ఇల్లు బఫర్​ జోన్​లో లేదు - ఎందుకు సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

తన ఇల్లుపై సోషల్​ మీడియాలో వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్​ క్లారిటీ - తమ ఇల్లు బఫర్​ జోన్​లో లేదని స్పష్టం - ఆ ఇల్లు 44 ఏళ్ల క్రితమే నిర్మాణం

HYDRA Commissioner Ranganath Press Meet
HYDRA Commissioner Ranganath Press Meet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

HYDRA Commissioner Ranganath Press Meet : హైదరాబాద్ మధురానగర్‌లో నివాసం ఉంటున్న తన ఇల్లు బఫర్‌ జోన్‌లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ స్పష్టం చేశారు. 44 ఏళ్ల క్రితం తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే అంతా కలిసి ఉంటున్నామని.. ఈ ఇళ్లు బఫర్‌ జోన్‌లో ఉందని సామాజిక మాధ్యమాలు సహా కొన్ని పేపర్లలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పటి పెద్దచెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్క్‌గా మార్చారని గుర్తుచేశారు. చెరువుకట్టకు దిగువన 10 మీటర్లు దాటితే.. కింద ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్‌ జోన్‌ పరిధిలోకి రావని తెలిపారు. అయినప్పటికీ తమ ఇల్లు కట్టకు దాదాపు కిలోమీటర్‌ దూరంలో ఉందని.. మధ్యలో వేలాది ఇళ్లు ఉన్నాయని వెల్లడించారు. తమ ఇళ్లు బఫర్‌ జోన్‌లో లేదని అందరూ గమనించాలని రంగనాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.