Student Strike in Telangana Against Government : గ్రూప్-2, 3 ఉద్యోగాల భర్తీలో పోస్టులను పెంచాలని గ్రూప్-1 మెయిన్స్ 1:100 నిష్పత్తి అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న తదితర డిమాండ్లపై నిరుద్యోగ సంఘాలు నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చాయి. పలు నిరుద్యోగ సంఘాలు ఇచ్చిన మార్చ్‌ను దృష్టిలో పెట్టుకొని నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
గ్రూప్ - 2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ వద్ద బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం బీఆర్ఎస్వీ ఆందోళన నిర్వహించింది. డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని, అక్టోబర్‌లో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ ముట్టడించింది. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం ఆపమని బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు శ్రీనివాస్ అన్నారు.
ఓయూలో 'నిరుద్యోగ మార్చ్'.. విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ నేతల అరెస్ట్