Without IELTS Countries: నేడు ఎంతో మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని ఆశపడుతున్నారు. కానీ విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆయా దేశాలు ఐఈఎల్‌టీఎస్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో మంచి స్కోరు సంపాదించిన వారికి ఉన్నత విద్యాసంస్థలో సీటు వస్తుంది. దీంతో కొంత మంది విదేశాల్లో చదవుకోవాలనే కల కళగానే మిగిలిపోతుంది. కాని కొన్ని దేశాల్లో ఎటువంటి స్కోరూ అవసరం లేకుండా నేరుగా యూనివర్శిటీ నిబంధనలు అనుసరించి ప్రవేశాలు పొందవచ్చు. ఆ దేశాలు వివరాలు ఏంటో తెలుసుకుందాం.
జర్మనీలో భాష విశయంలో కొంత సౌకర్యం: జర్మనీలో తక్కువ ఖర్చులో ఉన్నత ప్రమాణాలతో విద్య దొరుకుతుంది అనేది తెలిసిన విషయమే. ఇందులో చాలా విద్యాసంస్థలు ఐఈఎల్‌టీఎస్ లేకుండా టోఫెల్ లేదా తమ సొంత లాంగ్వేజ్ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ భాష విషయంలో కాస్త సౌకర్యం లభిస్తుంది.
ఫ్రాన్స్ స్థానిక పరీక్షతో ప్రవేశాలు : తన సాంస్కృతిక వైవిధ్యాలతో ఆకట్టుకుంటుందీ దేశం. అంతేకాదు పేరెన్నికగన్న విద్యావిధానాలు ఇక్కడి ప్రత్యేకత. చాలా ఫ్రెంచ్ వర్శిటీలు డీఈఎల్‌ఎఫ్ లేదా డీఏఎల్‌ఎఫ్ (స్థానిక పరీక్ష)తో ప్రవేశాలు అందిస్తాయి.
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని టాప్ టైర్ కాలేజీల్లో సీటు సంపాదించాలంటే ఐఈఎల్‌టీఎస్ అవసరం లేదు. ఆల్టర్నేటివ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులను ఇవి అనుమతిస్తాయి. పీటీఈ అకడమిక్ లేదా కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ వంటివి ముఖ్యమైన ఉదాహరణలు.
కెనడా : చక్కని వాతావరణం, ఉన్నతమైన విద్యాప్రమాణాలతో కెనడా ఎప్పుడూ విద్యార్థుల ఆలోచనల్లో ఉంటుంది. ఇక్కడి విద్యాసంస్థల్లో టోఫెల్, పీటీఈ అకడమిక్, ఇతర భాషా ప్రావీణ్య పరీక్షల స్కోరులను అనుమతిస్తున్నారు. ఎంచుకున్న యూనివర్సిటీను బట్టి ఇది మారుతుంది.