Teacher And Students Working in Same Police Station :ఈ చిత్రంలో ఎస్సైగా యూనిఫాంలో ఉన్న యువతి పేరు జబీనా బేగం. పక్కన నిలబడింది అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న లాల్యానాయక్. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? వారిద్దరు గురుశిష్యులు. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న విద్యార్థిని, ఎస్సైగా తాను కానిస్టేబుల్‌గా పని చేసే స్టేషన్‌కే రావడం ఇందులో ప్రత్యేకత. ఇద్దరూ పేదరికం అనే అడ్డంకిని దాటుకుని ఆయా స్థానాలకు చేరుకోవడం మరింత ప్రత్యేకం.
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యానాయక్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి నాలుగో తరగతిలో అదే మండలంలోని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడంతో అక్కడే ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తర్వాత పాల్వంచలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి పరిగిలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేశారు. కరోనా సమయంలో కళాశాల మూతపడటంతో ఉపాధి కోల్పోయారు. పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు.
YUVA : విద్యార్థులు బడికి డుమ్మాకొట్టారంటే ఈ మాస్టర్ ఇంటికొచ్చేస్తారు - ఇక పిల్లలతో పాటు పెద్దలకూ పాఠాలు! - Teacher Teaching Innovative Way
పెళ్లి ఆపించి, చేదోడుగా ఉండి :లాల్యానాయక్ లెక్చరర్‌గా పని చేస్తున్న సమయంలో నిరుపేద నేపథ్యం ఉన్న అదే జిల్లాలోని మక్తా వెంకటాపూర్ గ్రామానికి చెందిన జబీనా బేగం ఇంటర్మీడియట్‌లో చేరారు. చదువులో చురుగ్గా ఉండడంతో లాల్యానాయక్ ఆమెను ప్రోత్సహించారు. ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించేందుకు ప్రయత్నించారు. ఆ విషయం తెలుసుకున్న లాల్యానాయక్ వారితో మాట్లాడి రద్దు చేయించారు. ఇంటర్‌తో పాటు డిగ్రీ చదివే వరకు అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకూ చేదోడుగా ఉన్నారు.
తెలుసుకుని సెల్యూట్ చేసేందుకు : గురువు ప్రోత్సాహానికి స్వయం కృషిని జోడించిన జబీనా బేగం, 2024లో ఎస్సై పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా (ప్రొబేషన్) మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ పొందారు. తన శిష్యురాలు బుధవారం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్నట్టు తెలుసుకున్న లాల్యానాయక్, జబీనబేగంకు ప్రధాన ద్వారం వద్ద సెల్యూట్ చేసి స్వాగతం పలికారు.
ఎడ్లబండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు - గురుభక్తి చాటుకున్న విద్యార్థులు - Teacher Retirement Celebrations
ట్యూషన్ మాస్టారుపై ప్రేమ.. ఘనంగా సన్మానించిన 500 మంది విద్యార్థులు