జగన్‌పై దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - Stone Attack on Jagan in AP - STONE ATTACK ON JAGAN IN AP
Stone Attack on Jagan in AP : ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు యువకులు సీసీఎస్ పోలీసుల అదుపులో అనుమానితులు ఉన్నట్లు సమాచారం. సిట్ వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Stone Attack on Jagan in AP
Published : Apr 16, 2024, 1:18 PM IST
Stone Attack on Jagan in AP : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు, స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఆధ్వర్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.