Stock market Cyber Fraud In Hyderabad : సైబర్ నేరాలు (Cyber Crimes) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, ఈ కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకు కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని 63 ఏళ్ల వృద్దుడి నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి లాభాల ఆశ చూపించి రూ.5.98 కోట్లు కొట్టేశారు.
స్టాక్ మార్కెట్లో (Stock market) పెట్టుబడుల ఆశ చూపించిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.5.98 కోట్లు కొట్టేశారు. ఒక సైబర్ నేరంలో ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము కోల్పోవడం రాష్ట్రంలోనే అరుదని పోలీసులు చెబుతున్నారు. బాధితుడు దాదాపు 30 రోజుల వ్యవధిలో ఈ డబ్బు విడతల వారీగా పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 63 ఏళ్ల వృద్ధుడు వ్యాపార రంగంలో ఉన్నాడు. ఇటీవల ఆయనకు వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది.
చైనా హ్యాకర్ల చేతిలో భారత డేటా- మరో 19 దేశాలపైనా సైబర్ దాడి!
Cyber Crime Cases in Hyderabad : ఇది నమ్మి చాటింగ్ చేయగా, అవతలి వ్యక్తులు తమతో కలిసి వ్యాపారం చేయాలని ఐపీవోకు వెళ్లే కంపెనీల షేర్లను ముందే బ్లాక్ చేసి దక్కేలా చూస్తామని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయాలని నమ్మించారు. నిజమేనని వృద్ధుడు భావించడంతో అతనితో ఒక ట్రేడింగ్ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. నేరగాళ్లు వివిధ షేర్లు కొనిపించినట్లు నమ్మించి, తమ బ్యాంకు ఖాతాలకు రూ.5.98 కోట్లు బదిలీ చేయించుకున్నారు. నిజంగానే లాభాలు వస్తున్నాయని నమ్మించేందుకు ఓ టెలీగ్రామ్ గ్రూపులో చేర్పించారు.
ఈ డబ్బుతో షేర్లు కొన్నందుకు పెట్టుబడి లాభం కలిపి రూ.21 కోట్లు అయినట్లు యాప్‌లో చూపించారు. ఈ డబ్బును వృద్ధుడు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా మెలిక పెట్టారు. మొత్తం సొమ్ము రావాలంటే రూ.2 కోట్లు తమ ఖాతాకు పంపాలని చెప్పారు. మొత్తం సొమ్ము కాకపోయినా కొంతైనా ఇవ్వాలని కోరగా నిరాకరించారు. పోనీ తన పెట్టుబడి డబ్బును వెనక్కి ఇవ్వాలని అడగ్గా, మరింత సొమ్ము పంపాలంటూ రోజులు ఆలస్యం చేశారు. దీంతో బాధితుడు సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ వ్యూహాత్మక అడుగులు - సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
రూ.49కే 48 గుడ్లంటూ ఆఫర్- లింక్‌పై క్లిక్ చేస్తే క్షణాల్లో రూ.48వేలు మాయం!